CSK vs RCB: ధోనిని దారుణంగా ట్రోల్‌ చేసిన సెహ్వాగ్‌! మరీ అలా అనేశాడేంటి భయ్యా..?

ఆర్సీబీ తమ సొంత స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. ధోని చివరిలో బ్యాటింగ్‌కు రావడంపై విమర్శలు వస్తున్నాయి. సెహ్వాగ్‌ ధోనిని ట్రోల్‌ చేశాడు. అశ్విన్‌కు ముందు ధోని బ్యాటింగ్‌కు రాకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ, ధోని చివరి ఓవర్లలో అద్భుతమైన షాట్లు ఆడారు.

CSK vs RCB: ధోనిని దారుణంగా ట్రోల్‌ చేసిన సెహ్వాగ్‌! మరీ అలా అనేశాడేంటి భయ్యా..?
Virender Sehwag Ms Dhoni

Updated on: Mar 29, 2025 | 1:05 PM

పటిష్టమైన చెన్నై సూపర్‌ కింగ్స్‌ను వాళ్ల సొంత గ్రౌండ్‌లో ఓడించిన తర్వాత ఆర్సీబీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎప్పుడో ఐపీఎల్‌ ప్రారంభ ఏడాదిలో సీఎస్‌కేను చెపాక్‌లో ఓడించిన ఆర్సీబీ.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత చెపాక్‌లో సీఎస్‌కేపై విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో చివర్లో వచ్చి బ్యాటింగ్‌ చేసిన ధోనిపై విమర్శలు వస్తున్నాయి. టీమిండియా మాజీ క్రికెటర్‌, డాషింగ్‌ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ సైతం ధోనిని దారుణంగా ట్రోల్‌ చేశాడు. “చాలా త్వరగా బ్యాటింగ్‌కు వచ్చాడు” అంటూ ధోనిపై సెటైర్‌ వేశాడు.

బ్యాటింగ్‌ చేసే ఎబిలిటీ ఉన్న ధోని.. మరీ 7 వికెట్లు కోల్పోయిన తర్వాత 9వ స్థానంలో బ్యాటింగ్‌కు రావడం ఎవరికీ అంత బాగా అనిపించలేదు. ఇదే విషయాన్ని సెహ్వాగ్‌ ప్రస్తావిస్తూ.. కాస్త వ్యంగ్యంగా సహజంగా చివరి రెండు ఓవర్లలో బ్యాటింగ్‌కు వచ్చే ధోని, ఈ సారి కాస్త ముందుగానే బ్యాటింగ్‌కు వచ్చాడుగా అంటూ పేర్కొన్నాడు. మరీ దారుణంగా రవిచంద్రన్‌ అశ్విన్‌ తర్వాత ధోని బ్యాటింగ్‌కి రావడం సీఎస్‌కే ఫ్యాన్ష్‌కు కూడా రుచించలేదు. అశ్విన్‌ బ్యాటింగ్‌కి వచ్చే సమాచానికి సీఎస్‌కేకే ఓవర్‌కు దాదాపు 19 పరుగులు అవసరం. అంత క్లిష్ట పరిస్థితుల్లో తాను బ్యాటింగ్‌కు రాకుండా అశ్విన్‌ను పంపడం ఏంటని అంతా షాక్‌ అయ్యారు.

అయితే శరీరం అంతగా సహకరించకున్నా.. కేవలం అభిమానుల కోసమే ఐపీఎల్‌ ఆడుతున్న ధోని.. గత సీజన్‌ నుంచి చివరి ఓవర్లలోనే బ్యాటింగ్‌కు వస్తున్న విషయం తెలిసిందే. ఆర్సీబీతో జరిగిన నిన్నటి మ్యాచ్‌లో ధోని 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా.. చివరి ఓవర్లలో భారీ షాట్లతో సీఎస్‌కే అభిమానులను సంతోష పెట్టాడు. మ్యాచ్‌ ఓడిపోయినా.. ధోని బ్యాట్‌ నుంచి సూపర్‌ షాట్‌ వచ్చాయి.. చాల్లే అంటూ సీఎస్‌కే ఫ్యాన్స్‌ ఓటమి బాధను దిగమింగుకున్నారు. మరి వచ్చే మ్యాచ్‌ల్లోనైనా ధోని ముందుగా బ్యాటింగ్‌కు వస్తాడో లేదో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.