పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 మొదటి టెస్ట్‌లో విరాట్ కోహ్లీ అద్భుత పదర్శన చేస్తున్నాడు. పెర్త్ టెస్టులో 3వ రోజు జరిగిన మ్యాచ్లో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లి సిక్సర్‌ను కొట్టినప్పుడు సెక్యూరిటీ గార్డు తలకి బలంగా తాకింది. వెంటనే అతడికి ఎలా ఉందని కోహ్లీ అలా చూస్తూ ఉండిపోయాడు. మరోవైపు ఫిజియో అక్కడికి చేరుకొని సెక్యూరిటీ గార్డు ఆరోగ్య పరిస్థతి గురించి ఆరా తీశారు.
ఇది ఇలా ఉంటే పెర్త్ టెస్టు మూడో రోజు రెండో సెషన్ ముగిసింది. రెండో సెషన్‌కు టీమిండియా 359/5 పరుగులతో 405 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. భారత బౌలర్లలో విరాట్ కోహ్లీ 40 పరుగులతో, వాషింగ్టన్ సుందర్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. మొదట రిషబ్ పంత్(1) పరుగుల వద్ద అవుట్ కాగా, ధృవ్ జురెల్(1) కూడా పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ జురెల్‌ను ఔట్ చేశాడు.ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ మైదానంలోకి వచ్చాడు. 97 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 321/5 ఉంది. ఆ సమయంలో కోహ్లి 16 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు.
📂 Virat Kohli’s Swashbuckling six .MP4
📺 #AUSvINDOnStar 👉 1st Test, Day 3, LIVE NOW! #AUSvIND #ToughestRivalry pic.twitter.com/w0KmBbFznu
— Star Sports (@StarSportsIndia) November 24, 2024
పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మొదటి మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ 161 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో జైస్వాల్ భారత మాజీ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్‌ను సమం చేశాడు. కష్టతరమైన పిచ్‌పై 205 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో జైస్వాల్ సెంచరీ పూర్తి చేశాడు.
జైస్వాల్ సచిన్ టెండూల్కర్‌తో సమానంగా నిలిచాడు. 2024 క్యాలెండర్ ఇయర్‌లో జైస్వాల్‌కి ఇది మూడో టెస్టు సెంచరీ. ప్రస్తుతం జైస్వాల్ వయసు 22 ఏళ్ల కాగా, దిగ్గజం టెండూల్కర్ 1992 క్యాలెండర్ ఇయర్‌లో 23 ఏళ్లలోపు 3 సెంచరీలు సాధించాడు. ఈ విధంగా జైస్వాల్ సచిన్ టెండూల్కర్‌ను సమం చేశాడు. ఈ జాబితాలో సునీల్ గవాస్కర్, వినోద్ కాంబ్లీ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. 1971 క్యాలెండర్ ఇయర్‌లో గవాస్కర్ 4 సెంచరీలు సాధించాడు. ఇది కాకుండా, వినోద్ కాంబ్లీ 1993 క్యాలెండర్ సంవత్సరంలో 4 సెంచరీలు చేశాడు.
భారత్ ప్లేయింగ్ 11: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా.
ఇది కూడా చదవండి: IPL 2025 Auction: ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత కాస్ట్లీ ప్లేయర్లు వీరే.. లిస్టులో మనోళ్లు ఎంతమందంటే?
ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11: ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హేజిల్‌వుడ్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి