Virat Kohli : కింగ్ కోహ్లీ కనబడట్లేదోచ్.. ఇన్‌స్టాలో వెతికి వెతికి ఫ్యాన్స్ నీరసించిపోతున్న ఫ్యాన్స్

Virat Kohli : ప్రపంచ క్రికెట్ ఐకాన్, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అభిమానులకు భారీ షాక్ తగిలింది. సోషల్ మీడియాలో అత్యంత ఆధిపత్యం చలాయించే కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఒక్కసారిగా మాయమైపోయింది. రాత్రికి రాత్రే అతని అకౌంట్ డియాక్టివేట్ కావడంతో 27 కోట్లకు పైగా ఉన్న ఫాలోవర్లు అయోమయంలో పడ్డారు. ఇది ఏదైనా సాంకేతిక లోపమా లేక కోహ్లీ స్వయంగా తీసుకున్న నిర్ణయమా అన్నది ఇప్పుడు క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.

Virat Kohli : కింగ్ కోహ్లీ కనబడట్లేదోచ్.. ఇన్‌స్టాలో వెతికి వెతికి ఫ్యాన్స్ నీరసించిపోతున్న ఫ్యాన్స్
Virat Kohli's Instagram

Updated on: Jan 30, 2026 | 6:32 AM

Virat Kohli : టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనకు 274 మిలియన్ల (27 కోట్ల 40 లక్షలు) కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫుట్‌బాల్ స్టార్స్ రొనాల్డో, మెస్సీ తర్వాత క్రీడా ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన వ్యక్తి కోహ్లీనే. అయితే అర్థరాత్రి అకస్మాత్తుగా ఆయన ఖాతా డియాక్టివేట్ కావడంతో సోషల్ మీడియా వేదికగా చర్చ మొదలైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో Virat Kohli అని సెర్చ్ చేస్తే.. ఏ ప్రొఫైల్ కనిపించడం లేదు, పైగా సారీ, దిస్ పేజ్ ఈజ్ నాట్ అవైలబుల్ అనే మెసేజ్ కనిపిస్తోంది.

ఈ మిస్టరీ కేవలం విరాట్ కోహ్లీతోనే ఆగిపోలేదు. ఆయన సోదరుడు వికాస్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కూడా ఇప్పుడు సెర్చ్‌లో కనిపించడం లేదు. ఇద్దరు అన్నదమ్ముల అకౌంట్లు ఒకేసారి మాయం కావడంతో ఇది హ్యాకింగ్ ఫలితమా? లేక ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌లో ఏదైనా భారీ సాంకేతిక లోపం తలెత్తిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై విరాట్ కోహ్లీ టీమ్ గానీ, ఆయన మేనేజ్‌మెంట్ గానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. గతంలో కూడా కోహ్లీ తన కుటుంబం కోసం, మానసిక ప్రశాంతత కోసం సోషల్ మీడియా నుంచి విరామం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి, కానీ అకౌంట్ పూర్తిగా డియాక్టివేట్ చేయడం ఇదే తొలిసారి.

కోహ్లీ ఫ్యాన్స్ ఇప్పుడు ఎక్స్ వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. స్క్రీన్‌షాట్లు షేర్ చేస్తూ.. మా కింగ్ ఎక్కడికి పోయాడు? అంటూ ట్రెండ్ చేస్తున్నారు. ఒక వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కోట్లాది రూపాయల సంపాదనను గడిస్తున్న తరుణంలో, ఇంత పెద్ద అకౌంట్ మాయం కావడం వెనుక ఏదైనా పెద్ద కారణమే ఉండి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బహుశా ఏదైనా బ్రాండ్ ప్రమోషన్ కోసం చేస్తున్న స్టంట్ కావొచ్చని కొందరు అంటుంటే, ప్రైవసీ కారణాల వల్ల కోహ్లీ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవలి కాలంలో విరాట్ కోహ్లీ తన ఆటపై, కుటుంబంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన, ఇతర ఫార్మాట్లలో రాణించేందుకు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ నుంచి దూరంగా ఉండాలని భావించి ఉండవచ్చు. ఏది ఏమైనా 27 కోట్ల మంది ఫాలోవర్లు కలిగిన అకౌంట్ మాయం కావడం అనేది డిజిటల్ ప్రపంచంలో ఒక సంచలనమే. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే విరాట్ కోహ్లీ స్వయంగా స్పందించాల్సిందే.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..