విరాట్‌ కోహ్లీకి టెన్త్‌ క్లాస్‌లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా? వైరల్‌ అవుతున్న మార్క్స్‌ షీట్‌!

విరాట్ కోహ్లీ 10వ తరగతి మార్కుల పట్టిక సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంగ్లీష్, సోషల్ సైన్స్‌లో మంచి మార్కులు సాధించినా, మ్యాథ్స్, సైన్స్‌లో తక్కువ మార్కులు వచ్చాయి. ఈ ఘటన మార్కుల కంటే అభిరుచి, అంకితభావం ఎంతో ముఖ్యమని తెలియజేస్తుంది. కోహ్లీ విజయం అతని కష్టపడే స్వభావాన్ని, అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది.

విరాట్‌ కోహ్లీకి టెన్త్‌ క్లాస్‌లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా? వైరల్‌ అవుతున్న మార్క్స్‌ షీట్‌!
Virat Kohli

Updated on: May 15, 2025 | 4:05 PM

విరాట్‌ కోహ్లీ.. ఫేస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ క్రికెట్‌. ఒక ఆటగాడిగా ఎన్నో రికార్డులు అంతకుమించి కీర్తి సొంత చేసుకున్న కోహ్లీ.. ఇటీవలె అంతర్జాతీయ టెస్ట్‌ ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి యావత్‌ క్రికెట్‌ ప్రపంచానికి షాక్‌ ఇచ్చాడు. రిటైర్మెంట్‌ విషయం పక్కనపెడితే.. తాజాగా విరాట్‌ కోహ్లీ టెన్త్‌ క్లాస్‌ మార్క్‌ షీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లీ CBSE 10వ తరగతి మార్కుల షీట్‌లో ఇంగ్లీష్, హిందీ, సోషల్ సైన్స్ సబ్జెక్టులలో మంచి మార్కులు సాధించాడు. ఆ మార్కులు చూస్తుంటే.. కోహ్లీ బ్యాడ్‌ స్టూడెంట్‌ కాదు.. చదువుల్లో మంచి పట్టుకున్న విద్యార్థిలానే అనిపిస్తోంది.

కానీ మ్యాథ్స్, సైన్స్, ఇంట్రడక్టరీ ఐటీలలో తక్కువ మార్కులు వచ్చాయి. ఇంగ్లీష్, సోషల్ సైన్స్‌లో వరుసగా A1, A2, హిందీలో B1, సైన్స్‌లో C1, మ్యాథ్స్, ఇంట్రడక్టరీ ఐటీలో C2 వచ్చాయి. అతని అత్యధిక మార్కులు ఇంగ్లీష్‌లో 83, సోకల్ సైన్స్‌లో 81 మార్కులు వచ్చాయి. ఈ మార్కుల షీట్‌ను IAS జితిన్ యాదవ్ ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ మార్కుల షీట్ అంతగా ఆకట్టుకోకపోయినా విరాట్ కోహ్లీ కృషిలో స్థిరత్వాన్ని చూపిస్తుంది. 10వ తరగతి బోర్డు పరీక్షలు సెకండరీ స్కూల్‌లో అత్యంత కఠినమైన పరీక్షలు కాబట్టి, చాలా మంది విద్యార్థులు వాటిని తమ భవిష్యత్తుకు నిర్ణయాత్మక అంశంగా భావిస్తారు.

జతిన్ యాదవ్ మార్కుల షీట్‌ను షేర్‌ చేస్తూ.. “మార్కులే ముఖ్యం అనుకుంటే ఇప్పుడు మొత్తం దేశం కోహ్లీ వెనుక ఉండేది కాదు. అభిరుచి, అంకితభావం కీలకం” అని అన్నారు. ఈ పోస్ట్‌తో చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఇదే. జీవితంలో చదువు ఎంతో ముఖ్యం. చదువుతో జ్ఞానం పొందాలి. అంతేకానీ.. మార్కులు, ర్యాంకులంటూ పిల్లల వెంట తల్లిదండ్రులు, టీచర్లు పడొద్దు. పిల్లలు కూడా మార్కులను అంత సీరియస్‌గా తీసుకోకూడదు. తమ అభిరుచికి తగ్గట్లు ఆ రంగంలో మన హండ్రెడ్‌ పర్సంట్‌ ఎఫర్ట్‌ పెట్టాలి అప్పుడే మనం సక్సెస్‌ అవుతాం.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి