
ఐపీఎల్ 2025 (IPL 2025) ప్లేఆఫ్ మ్యాచ్‌లు మే 29 నుంచి ప్రారంభమవుతున్నాయి. మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతుంది. ఐపీఎల్ చరిత్రలో ప్లేఆఫ్స్‌లో ఏ ఆటగాడు అత్యధిక పరుగులు చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇది మాత్రమే కాదు, ప్లేఆఫ్స్‌లో విరాట్ కోహ్లీ ప్రదర్శనతోపాటు పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ప్లేఆఫ్ మ్యాచ్‌ల గణాంకాలను కూడా తెలుసుకుందాం..

ప్లేఆఫ్స్‌లో సురేష్ రైనా అత్యధికంగా 714 పరుగులు చేశాడు. ఈ ఆటగాడు IPL ప్లేఆఫ్స్‌లో 24 మ్యాచ్‌లు ఆడాడు. అతని స్ట్రైక్ రేట్ 155.21గా ఉంది.

ప్లేఆఫ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ ఎంఎస్ ధోని. ఈ అనుభవజ్ఞుడు 23 ప్లేఆఫ్ మ్యాచ్‌ల్లో 132 స్ట్రైక్ రేట్‌తో 523 పరుగులు చేశాడు.

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ప్లేఆఫ్స్‌లో 474 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ ఆటగాడు కేవలం 10 ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడాడు. అతని స్ట్రైక్ రేట్ కూడా 145 కంటే ఎక్కువగా ఉంది.

ప్లేఆఫ్స్‌లో విరాట్ కోహ్లీ రికార్డు చాలా పేలవంగా ఉంది. ఈ ఆటగాడు 15 ఇన్నింగ్స్‌లలో కేవలం 121.78 స్ట్రైక్ రేట్‌తో 341 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు కూడా 30 కంటే తక్కువగా ఉంది.

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ప్లేఆఫ్స్‌లో 214 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ సగటు 42.80గా ఉంది. అయ్యర్ ప్లేఆఫ్స్‌లో 9 మ్యాచ్‌లు ఆడి నాలుగుసార్లు అజేయంగా నిలిచాడు.