IND vs AUS: 29 మ్యాచ్‌లు, 5 సెంచరీలు.. ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ వన్డే రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Virat Kohli ODI Record in Australia: 2012, 2020 మధ్య ఆస్ట్రేలియాలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ మొత్తం 29 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 1300 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఆసీస్‌తో జరగబోయే వన్డే సిరీస్‌లో కోహ్లీ ప్రదర్శన ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం..

IND vs AUS: 29 మ్యాచ్‌లు, 5 సెంచరీలు.. ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ వన్డే రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే
Virat Kohli

Updated on: Oct 17, 2025 | 8:38 PM

India vs Australia: 224 రోజుల తర్వాత విరాట్ కోహ్లీ అక్టోబర్ 19 ఆదివారం అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వస్తున్నాడు. పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి వన్డేలో భారత్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. ప్రధానంగా విరాట్ కోహ్లీ, భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మపై దృష్టి సారించారు.

టీ20, టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత, కోహ్లీ ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లో మాత్రమే భారత్‌కు అందుబాటులో ఉన్నాడు. ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ 50 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 54.46 సగటు, 93.69 స్ట్రైక్ రేట్‌తో 2,451 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇందులో రెండు డకౌట్‌లు కూడా ఉన్నాయి.

విరాట్ కోహ్లీ భారతదేశం తరపున ఎన్ని వన్డే మ్యాచ్‌లు ఆడాడు?

భారత్ తరపున 302 వన్డేలు ఆడిన కోహ్లీ 14181 పరుగులు చేశాడు.

విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాలో ఎన్ని వన్డే మ్యాచ్‌లు ఆడాడు?

ఆస్ట్రేలియాలో మొత్తం 29 మ్యాచ్‌లు ఆడి, 51.03 సగటుతో, 89.06 స్ట్రైక్ రేట్‌తో 1327 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఐదు వన్డే సెంచరీలు చేసిన రికార్డును కూడా కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆరు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు.

ఆస్ట్రేలియాలో కోహ్లీ చేసిన అతిపెద్ద వన్డే ఇన్నింగ్స్ ఏది?

2012లో హోబర్ట్‌లో శ్రీలంకపై జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ చేసిన 133 నాటౌట్, ఆస్ట్రేలియాలో కోహ్లీ చేసిన అత్యధిక వన్డే ఇన్నింగ్స్ ఇది. ఇది కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్‌లో జరిగిన మ్యాచ్. ఈ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియాలో ఆడిన అత్యుత్తమ వన్డే ఇన్నింగ్స్‌లలో ఒకటిగా పేరుగాంచింది.

కోహ్లీ వన్డే కెరీర్ ఎలా ఉంది?

కోహ్లీ మొత్తం వన్డే కెరీర్‌లో 302 మ్యాచ్‌ల్లో 57.88 సగటు, 93.34 స్ట్రైక్ రేట్‌తో 14,181 పరుగులు చేశాడు. అతని పేరు మీద 51 వన్డే సెంచరీలు కూడా ఉన్నాయి.

ఎంతకాలం తర్వాత విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వస్తున్నాడు?

భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత విరామం తీసుకున్న విరాట్ కోహ్లీ.. ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వస్తున్నాడు. మాజీ కెప్టెన్ తన అత్యంత విజయవంతమైన ఫార్మాట్ అయిన వన్డేలపై మాత్రమే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..