IND vs ENG: బ్యాడ్‌న్యూస్.. కోహ్లీ కెరీర్‌లోనే తొలిసారి ఇలాంటి రోజు.. మొత్తం టెస్ట్ సిరీస్‌ నుంచి ఔట్..

Virat Kohli: విరాట్ కోహ్లీ టెస్ట్ సిరీస్ ప్రారంభానికి 3 రోజుల ముందు మొదటి, రెండవ మ్యాచ్‌ల నుంచి తన పేరును అకస్మాత్తుగా ఉపసంహరించుకున్నాడు. ఆ తర్వాత అతను తదుపరి 3 మ్యాచ్‌లకు తిరిగి వస్తాడని భావించారు. కానీ, ఇది జరగలేదు. ఇప్పుడు విరాట్ కోహ్లీ లేకుండానే టీం ఇండియా మిగిలిన 3 మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమైంది.

IND vs ENG: బ్యాడ్‌న్యూస్.. కోహ్లీ కెరీర్‌లోనే తొలిసారి ఇలాంటి రోజు.. మొత్తం టెస్ట్ సిరీస్‌ నుంచి ఔట్..
Virat Kohli
Follow us

|

Updated on: Feb 10, 2024 | 10:46 AM

Virat Kohli News: ఎట్టకేలకు, ప్రతి భారతీయ క్రికెట్ అభిమాని భయపడుతున్న వార్త నిజమైంది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లిని చూడాలనే ఆశ కూడా అడియాసలైంది. సిరీస్‌లో మిగిలిన 3 మ్యాచ్‌ల్లోనూ విరాట్ కోహ్లీ ఆడడంలేదు. ఈ విషయాన్ని స్టార్ బ్యాట్స్‌మెన్ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు తెలియజేశాడు. కోహ్లి మొదటి, రెండో టెస్టుల్లో కూడా ఆడలేకపోయాడు. అయితే, అతను మూడు, నాల్గవ టెస్టులకు దూరమయ్యాడనే వార్తలు వస్తున్నాయి. ఐదో టెస్టులో పునరాగమనంపై ఆశలు ఉన్నప్పటికీ ఇప్పుడు అది కూడా జరగదని తేలింది.

గత కొన్ని రోజులుగా, సిరీస్‌లో మూడు, నాలుగు, ఐదవ టెస్టుల కోసం టీమిండియా స్వ్కాడ్ ప్రకటన కోసం అంతా వేచి చూస్తున్నారు. విరాట్ కోహ్లి అందుబాటులోకి వచ్చే విషయంలో స్పష్టత లేకపోవడంతో ఈ ప్రకటన నిలిచిపోయిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక నివేదికలో ఫిబ్రవరి 9వ తేదీ శుక్రవారం, కోహ్లీ తదుపరి 3 మ్యాచ్‌లలో కూడా ఆడలేనని బీసీసీఐకి తెలిపాడు. శుక్రవారం సెలక్షన్ కమిటీ సమావేశం కూడా జరిగింది.

ఇది కోహ్లీ కెరీర్‌లోనే తొలిసారి..

దీంతో ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో కోహ్లీ ఏ మ్యాచ్‌ కూడా ఆడలేడు. 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లి తన కెరీర్‌లో తొలిసారి ఇలాంటి రోజును చూడాల్సి వచ్చింది. స్వదేశంలో జరిగే ఏ టెస్టు సిరీస్‌లోనూ కోహ్లీ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకపోవడం ఇదే తొలిసారి. దీనికి ముందు కూడా, కోహ్లీ టెస్ట్ సిరీస్‌లో మ్యాచ్ ఆడలేకపోయిన కొన్ని సందర్భాల్లో ఇది జరిగింది. కానీ, అతను ఆడకుండానే స్వదేశంలో టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉండటం మాత్రం మొదటిసారి.

హఠాత్తుగా పేరు ఉపసంహరణ..

టెస్టు సిరీస్‌లో తొలి 2 మ్యాచ్‌ల కోసం టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీని ఎంపిక చేశారు. అతను జట్టుతో కలిసి హైదరాబాద్ చేరుకున్నాడు. అక్కడ అతను ఒక రోజు శిక్షణా శిబిరంలో కూడా పాల్గొన్నాడు. ఆ తర్వాత జనవరి 22న రామమందిర ప్రాణ ప్రతిష్టకు హాజరు కావాల్సి ఉండగా రాకపోవడంతో అదే రోజు బీసీసీఐ రెండు మ్యాచ్‌ల నుంచి కోహ్లీ వైదొలిగినట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడని, కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కూడా మాట్లాడాడని భారత బోర్డు తన పత్రికా ప్రకటనలో తెలిపింది. కోహ్లీ గోప్యతపై శ్రద్ధ వహించాలని, ఊహాగానాలకు దూరంగా ఉండాలని బోర్డు కూడా విజ్ఞప్తి చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్