Virat Kohli: విరాట్ కోహ్లీపై వేటు పడనుందా.? మూడో టెస్టుకు టీమిండియా కెప్టెన్ దూరమవుతాడా.!

Virat Kohli: రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించిన టీమిండియా రెట్టింపు ఉత్సాహంతో మూడో మ్యాచ్‌కు సన్నద్ధం అవుతోంది. అయితే టీమిండియా..

Virat Kohli: విరాట్ కోహ్లీపై వేటు పడనుందా.? మూడో టెస్టుకు టీమిండియా కెప్టెన్ దూరమవుతాడా.!
Virat Kohli Captaincy
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 17, 2021 | 7:01 PM

Virat Kohli: రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించిన టీమిండియా రెట్టింపు ఉత్సాహంతో మూడో మ్యాచ్‌కు సన్నద్ధం అవుతోంది. అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాత్రం వేటు పడనుందని వార్తలు వినిపిస్తున్నాయి. సెకండ్ టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో ఆన్‌ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్‌తో కోహ్లీ తీవ్ర వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ఈ గొడవ కారణంగా మూడో టెస్టుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

సెకండ్ ఇన్నింగ్స్‌లో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ప్యాడ్‌కు తాకి బంతి వెనక్కి వెళ్లడంతో టీమిండియా ప్లేయర్స్ ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేశారు. అయితే ఆన్‌ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ దాన్ని నాటౌట్‌గా ప్రకటించారు.

దీనితో కోహ్లీ రివ్యూ తీసుకున్నాడు. ఆ రివ్యూలో బంతి ప్యాడ్‌కు తాకినట్లు తేలింది. అంతేకాకుండా ఎల్బీడబ్ల్యూ రివ్యూలో బంతి వికెట్లను సైతం తాకినట్లు స్పష్టమైంది. కానీ అక్కడ అంపైర్ కాల్‌తో రూట్ ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆ నిర్ణయం వల్ల కోహ్లీ అంపైర్ నితిన్ మీనన్‌తో వాగ్వాదానికి దిగాడు. అంపైర్లు ఎంతగా సర్ది చెప్పినా వినిపించుకోలేదు. ఇక కోహ్లీ చేసిన ఈ తప్పును లెవెల్ 1 లేదా లెవెల్ 2 తప్పిదంగా పరిగణించే అవకాశం ఉంది. ఈ తప్పుకు కనీసం నాలుగు డీ మెరిట్ పాయింట్స్‌ వచ్చే ఛాన్స్ ఉండటంతో.. ఇప్పటికే అతడిపై ఉన్న రెండు డీ మెరిట్ పాయింట్స్‌ కూడా కలిపితే ఓ టెస్టు మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉంది.

మరిన్ని చదవండి:

‘అత్మనిర్భర్ భారత్’కు కేంద్రం మరో ముందడుగు.. మ్యాపింగ్ విధానంలో కీలక మార్పులు..

ముచ్చటపడి రూ. 100 కోట్ల విల్లా కొన్నాడు.. మనీ లాండరింగ్ కేసులో అడ్డంగా బుక్కైయ్యాడు…

భర్తతో కలిసి ఫేవరెట్ ప్లేస్‌లో కాజల్ డిన్నర్ డేట్.. అదేంటో మనం కూడా చూసేద్దాం..!

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్