Virat Kohli: రూ. 1115 కోట్లకు అధిపతి.. రోడ్డు పక్కన ఆ ఫుడ్ అంటేనే ఇష్టమంటోన్న కోహ్లీ

Virat Kohli Favourite Street Food: కోహ్లీ ఆహారపు అలవాట్లు చూస్తుంటే క్రమశిక్షణతో కూడిన డైట్ పాటిస్తూనే, అప్పుడప్పుడు మనసుకు నచ్చిన రుచులను ఆస్వాదించడం మానసిక ఉల్లాసానికి ఎంత అవసరమో అర్థమవుతుంది. ఇష్టమైన ఫుడ్ తింటూనే కఠిన సాధనతో ప్రపంచంలోనే అత్యంత ఫిట్ క్రికెటర్‌గా కొనసాగుతున్న విరాట్ ప్రయాణం ప్రతి ఒక్కరికీ ఓ గొప్ప క్రీడా స్ఫూర్తి.

Virat Kohli: రూ. 1115 కోట్లకు అధిపతి.. రోడ్డు పక్కన ఆ ఫుడ్ అంటేనే ఇష్టమంటోన్న కోహ్లీ
Virat Kohli Favourite Street Food

Updated on: Aug 15, 2026 | 3:21 PM

Virat Kohli Favourite Street Food: క్రికెట్ మైదానంలో పరుగుల వరద పారించే విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అత్యంత కఠినమైన డైట్ నియమాలు ఫాలో అయ్యే కింగ్ కోహ్లీకి కూడా ఓ చిరు బలహీనత ఉంది. ఢిల్లీ వీధుల్లో దొరికే ఆ ఒక్క దేశీ వంటకం చూస్తే చాలు, ఆయన తన డైట్ రూల్స్ పక్కన పెట్టేస్తాడట.

ఢిల్లీ వీధుల్లో దొరికే ఆ వంటకమంటే ప్రాణం..

విరాట్ కోహ్లీ పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆయన కళ్లు చెదిరే బ్యాటింగే కాదు, ఎవరూ అందుకోలేని అత్యుత్తమ స్థాయి శారీరక ధారుడ్యం. ప్రపంచంలోనే అత్యంత ఫిట్ అథ్లెట్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న కోహ్లీ సైతం ఓ ఆహారం చూస్తే లొట్టలేసుకుని తింటాడు. అదే ఢిల్లీ వాసుల మనసు దోచిన ప్రసిద్ధ చోలే బటూరే.

కోహ్లీ పుట్టి పెరిగింది ఢిల్లీ నగరంలోనే కావడంతో అక్కడి స్థానిక రుచులంటే అతడికి ఎనలేని మక్కువ. మరీ విశేషంగా రజౌరీ గార్డెన్ లేదా జైల్ రోడ్ పరిసరాల్లో ఉండే రామా చోలే బటూరే సెంటర్ నుంచి వచ్చే బటూరే అంటే ప్రాణం పెడతాడు. ఎంత కఠినమైన వ్యాయామాలు చేసినా, తనకు ఇష్టమైన ఈ కమ్మటి స్ట్రీట్ ఫుడ్ గురించి అడిగితే చాలు కోహ్లీ ముఖంలో ఓ చిన్న పిల్లాడి ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది. తన పాత రోజులను నెమరువేసుకుంటూ ఆ రుచిని ఆస్వాదిస్తాడు.

ఇవి కూడా చదవండి

చీట్ మీల్స్ రోజున నోరూరించే దేశీ రుచులు..

ఎప్పుడైనా కఠినమైన డైట్ నుంచి చిన్న బ్రేక్ తీసుకునే సమయంలో కోహ్లీ పూర్తిగా నార్త్ ఇండియన్ వంటకాల వైపే మొగ్గుచూపుతాడు. ఆ రోజు అతడి ప్లేట్‌లో పక్కా దేశీ ఇంటి భోజనం తరహా రుచులు దర్శనమిస్తాయి. వేడి వేడి అన్నంలో కమ్మటి రాజ్మా చావల్ లేదా కడీ చావల్ కలుపుకుని తినడం అతడికి ఎంతో ఇష్టమైన వ్యాపకం. ఇవి అతడికి తన మూలాలను గుర్తు చేస్తాయి.

వీటితో పాటు గార్లిక్ నాన్‌లోకి మసాలా దట్టించిన దాల్ మఖానీ కాంబినేషన్‌ను ఎగబడి తింటాడు. స్వచ్ఛమైన తెల్లటి వెన్న పూసిన ఆలూ పరాఠా రుచిని ఆస్వాదిస్తూ ఆకలి తీర్చుకుంటాడు. ఇక భోజనం పూర్తయిన తర్వాత తీపి కోసం చల్లటి ఐస్‌క్రీమ్‌తో కలిపిన వేడి వేడి గులాబ్ జామున్ లాగించేస్తాడు. ఇవి అతడికి అత్యంత ఇష్టమైన చీట్ మీల్స్ జాబితాలో ముందు వరుసలో ఉంటాయి.

మైదానంలో మెరుపుల వెనుక అసలు రహస్యం..

సాధారణ రోజుల్లో మాత్రం కోహ్లీ తన డైట్ విషయంలో ఎక్కడా రాజీ పడడు. శరీరాన్ని దృఢంగా ఉంచుకునేందుకు అత్యంత పరిశుభ్రమైన, పోషక విలువలు ఎక్కువగా ఉండే ఆహారాన్నే ఎంచుకుంటాడు. అతడి రోజువారీ మెనూలో అత్యధిక ప్రోటీన్లు ఉండే ఆకుపచ్చని ఆకులు, సూపర్ ఫుడ్ సలాడ్స్ తప్పనిసరిగా ఉంటాయి. ఇవి అతడికి రోజంతా అవసరమైన శక్తిని అందిస్తాయి.

కండరాల పటిష్టత కోసం నూనె తక్కువగా వాడి గ్రిల్ చేసిన చికెన్, తాజా కూరగాయలు తీసుకుంటాడు. తేలికగా జీర్ణమయ్యే మష్రూమ్ లేదా వెజిటబుల్ స్టీమ్డ్ డిమ్ సమ్స్ తినడానికి ఇష్టపడతాడు. ఉదయం పూట వ్యాయామం తర్వాత ఎనర్జీ కోసం చక్కెర ఏమాత్రం లేని ప్రోటీన్ షేక్‌లో పాలు, నీళ్లు, అరటిపండ్లు కలుపుకుని తాగుతాడు. ఇదే మైదానంలో ఆ పరుగుల యంత్రం అలుపెరగకుండా శ్రమించడానికి అసలు రహస్యం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us