పాపం.. బీసీసీఐ పెట్టిన రూల్‌తో కోహ్లీకి ఎన్ని కష్టాలొచ్చాయో చూడండి! కనీసం తిండి కూడా..

క్రికెట్‌ అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 బుధవారం(ఫిబ్రవరి 19) నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడుతున్నాయి. ఇక నెక్ట్స్‌ డే అంటే ఫిబ్రవరి 20న టీమిండియా, బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ ఆడనుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రాక్టీస్ సమయంలో కోహ్లీ చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అదేంటంటే..

పాపం.. బీసీసీఐ పెట్టిన రూల్‌తో కోహ్లీకి ఎన్ని కష్టాలొచ్చాయో చూడండి! కనీసం తిండి కూడా..
Virat Kohli

Updated on: Feb 17, 2025 | 10:14 AM

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 కోసం ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు దుబాయ్‌ చేరుకొని, అక్కడి ఐసీసీ అకాడమీలో ముమ్మరంగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విరాట్‌ కోహ్లీ పరిస్థితి చూసి క్రికెట్‌ అభిమానులు అయ్యో పాపం అంటున్నారు. నెట్‌ ప్రాక్టీస్‌ సందర్భంగా విరాట్‌ కోహ్లీ పుడ్‌ పార్సిల్‌ బాక్స్‌లతో కనిపించాడు. ప్రాక్టీస్‌ తర్వాత ఆర్డర్‌ చేసుకున్న ఫుడ్‌ను కోహ్లీ అక్కడే తినేశాడు. ఇంకో బాక్స్‌ను తనతో పాటు తీసుకెళ్లాడు. ఫుడ్‌ ఇంక డైట్‌ విషయంలో ఎంతో కేర్‌ తీసుకునే కోహ్లీ.. ఇలా ఆర్డర్‌ పెట్టుకొని తినాల్సిన అసవరం ఏముందని అనుకోవచ్చు. అందుకే బీసీసీఐ పెట్టిన రూల్సే కారణం. ఇటీవలె ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో టీమిండియా ఫేలవ ప్రదర్శనతో బీసీసీఐ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది.

ఓ 10 నిబంధనలు తీసుకొచ్చింది. ప్రతి ఆటగాడు డొమెస్టిక్‌ క్రికెట్‌ ఆడాలి, విదేశీ టూర్లకు ఫ్యామిలీతో రాకూడదు, లగేజ్‌ పరిమితంగా ఉండాలి, అలాగే విదేశీ టూర్లకు వ్యక్తిగత సిబ్బందిని తీసుకొని రాకూడదు, వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించ కూడదు, టీమ్‌ బస్‌లోనే రావాలి ఇలా చాలా రూల్స్‌ పెట్టింది. ఈ రూల్స్‌ కారణంగా విరాట్‌ తన వ్యక్తిగత చెఫ్‌ను దుబాయ్‌ తీసుకెళ్లలేకపోయాడు. దీంతో తనకు కావాల్సిన ఫుడ్‌ను ఆర్డర్‌ పెట్టుకొని ప్రాక్టీస్‌ చేసే చోటే తినేశాడు. బహుషా వాళ్లు బస చేస్తున్న హోటల్‌లో ఫుడ్‌ తన డైట్‌కు సరిపడక కోహ్లీ ఇలా చేసి ఉంటాడు. ఏది ఏమైనా బీసీసీఐ రూల్స్‌ స్టార్‌ క్రికెటర్లకు కాస్త ఇబ్బంది కరంగా మారాయనే చెప్పాలి. ఇక ప్రాక్టీస్‌ విషయానికి వస్తే.. ఛాంపియన్స్‌ ట్రోఫీలో మంచి ప్రదర్శన కనబర్చి కప్పు కొట్టాలనే లక్ష్యంతో టీమిండియా ఆటగాళ్లంతా నెట్స్‌లో చెమలు చిందిస్తున్నారు.

ముఖ్యంగా స్టార్‌ ప్లేయర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ నెట్స్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. అర్షదీప్‌ సింగ్‌, మొహమ్మద్‌ షమీ బౌలింగ్‌లో కోహ్లీ, రోహిత్‌ గంటకు పైగా ప్రాక్టీస్‌ చేశారు. కోహ్లీ డౌన్‌ ది స్టంప్‌ లైన్‌ డెవలరీస్‌ వేయించుకొని ఫ్లిక్‌, ఆన్‌ డ్రైవ్‌ షాట్లు ఎక్కువగా ప్రాక్టీస్‌ చేశాడు. ఇక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ అయిన అర్షదీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో ఇన్‌ కమింగ్‌ డెలవరీ, యార్కర్లు వేయించుకొని ప్రాక్టీస్‌ చేశాడు. కాగా నెట్‌ ప్రాక్టీస్‌ సందర్భంగా ఆదివారం రిషభ్‌ పంత్‌కు బాల్‌ తగలడంతో సపోర్టింగ్‌ స్టాఫ్‌ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. హార్ధిక్‌ పాండ్యా, శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న క్రమంలో వాచ్‌ ద బాల్‌ అంటూ అక్కడున్న వారిని అలెర్ట్‌ చేస్తూ కనిపించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..