Virat Kohli – Anushka Sharma: ముంబై వీధుల్లో స్కూటీపై చక్కర్లు కొట్టిన కోహ్లీ, అనుష్క.. నెట్టింట్లో వైరల్ వీడియో..

Asia Cup 2022: కెరీర్‌లో పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్న కోహ్లి కొంతకాలం విరామం తీసుకుని ప్రస్తుతం తన కుటుంబంతో గడుపుతున్నాడు.

Virat Kohli - Anushka Sharma: ముంబై వీధుల్లో స్కూటీపై చక్కర్లు కొట్టిన కోహ్లీ, అనుష్క.. నెట్టింట్లో వైరల్ వీడియో..
Virat Kohli Anushka Sharma

Updated on: Aug 20, 2022 | 9:29 PM

Virat Kohli – Anushka Sharma: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ దాదాపు నెల రోజులుగా క్రికెట్ ఫీల్డ్‌కు దూరంగా ఉన్నాడు. కెరీర్‌లో పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్న కోహ్లి కొంతకాలం విరామం తీసుకుని ప్రస్తుతం తన కుటుంబంతో గడుపుతున్నాడు. ఇటీవల, ఒక యాడ్ షూట్ తర్వాత తన భార్య అనుష్క శర్మతో కలిసి విరాట్ స్కూటీపై చక్కర్లు కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది.

విరాట్, అనుష్క స్కూటీపై చక్కర్లు..

ఇవి కూడా చదవండి

ఓ యాడ్ షూటింగ్ కోసం విరాట్, అనుష్క శర్మ ఐలాండ్ వెళ్లారు. అక్కడి నుంచి తిరిగొచ్చిన తర్వాత ఇద్దరూ నల్లటి స్కూటీపై తిరుగుతూ కనిపించారు. ఇద్దరూ నల్లటి హెల్మెట్ ధరించి మీడియాకు కనిపించకుండా దాక్కోవడానికి ప్రయత్నించారు. కానీ, ఇద్దరూ కెమెరాల నుంచి తప్పించుకోలేకపోయారు. వారి స్కూటీ రైడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విరాట్ స్కూటర్ నడుపుతున్నాడు. అనుష్క వెనుక కూర్చుంది. కోట్లకు పడగలెత్తిన కోహ్లి స్కూటీని నడపడం చూసి అభిమానులు చాలా ఆశ్చర్యపోయారు.

కోహ్లీ, అనుష్క ఓ బ్రాండ్‌ను ప్రారంభించబోతున్నారు..

అనుష్క ఇటీవల కోహ్లీతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. తన కొత్త బ్రాండ్ గురించి చెప్పుకొచ్చింది. విరాట్‌తో కలిసి ఉన్న ఫొటోను పంచుకుంది. అందులో ఆమె టీ-షర్ట్, జీన్స్‌లో కనిపించారు. కోహ్లి, అనుష్క రాక్‌స్టార్స్‌లా పోజులిచ్చారు. క్యాప్షన్‌లో, ‘నేను ఎప్పుడూ ఒక అందమైన అబ్బాయితో బ్యాండ్ ప్రారంభించాలనుకుంటున్నాను’ అని అనుష్క రాసుకొచ్చింది. విరాట్ కోహ్లీ ఇప్పటికే ఒక రెస్టారెంట్, దుస్తుల బ్రాండ్‌ను నడుపుతున్నాడు. అదే సమయంలో అనుష్క తన సొంత దుస్తుల బ్రాండ్‌ను కూడా కలిగి ఉంది.

కోహ్లీ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు..

విరాట్ కోహ్లి ప్రస్తుతం పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. 2019 సంవత్సరం నుంచి, అతను తన బ్యాట్‌తో ఒక్క సెంచరీని నమోదు చేయలేదు. అదే సమయంలో అతని బ్యాట్‌కు కొంతకాలంగా పరుగులు రాబట్టడంలోనూ విఫలమవుతోంది. కోహ్లిని జట్టు నుంచి తప్పించడంపై అనుభవజ్ఞులు కూడా మాట్లాడారు. అదే సమయంలో కోహ్లి మళ్లీ దేశవాళీ క్రికెట్‌కు వెళ్లడం ద్వారా కొంతకాలం విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us