T20 ప్రపంచ కప్ 2022 కంటే ముందు టీమిండియా.. ఆస్ట్రేలియాతో T20 సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్ కోసం టీమిండియా మొహాలీ చేరుకుంది. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మొహాలీ చేరుకుని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీపై స్పందించాడు. టీమ్ ఇండియాలో ఓపెనింగ్ కోసం విరాట్ మూడో ఎంపిక అని రోహిత్ చెప్పుకొచ్చాడు. కేఎల్ రాహుల్ విషయంలో వాళ్లు ఎలాంటి గందరగోళంలో లేరని తెలిపాడు.
కోహ్లీ ఓపెనింగ్ గురించి రోహిత్ మాట్లాడుతూ.. ‘విరాట్ కోహ్లి మా మూడో ఓపెనర్. అతను కొన్ని మ్యాచ్‌లలో ఓపెనర్‌గా మారతాడు. గత మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై చాలా బాగా ఆడాడు. మేం సంతోషంగా ఉన్నాం. టీ20 ప్రపంచకప్‌లో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తారని కూడా నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను’ అని పేర్కొన్నాడు.
2022 ఆసియా కప్‌లో కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ టోర్నీలో 5 మ్యాచ్‌లు ఆడి 276 పరుగులు చేశాడు. ఈ సమయంలో కోహ్లి ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. 2022 ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు.
రాహుల్ టీమ్ ఇండియాకు చాలా ముఖ్యమైన ఆటగాడు. మేం ఎలాంటి గందరగోళంలో లేమని, కేఎల్ నాణ్యమైన ఆటగాడని, బాగా రాణిస్తాడని మాకు తెలుసంటూ రోహిత్ తెలిపాడు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 20న మొహాలీలో జరగనుంది. సిరీస్‌లోని రెండవ మ్యాచ్ సెప్టెంబర్ 23 న నాగ్‌పూర్‌లో జరుగుతుంది. అదే సమయంలో చివరి మ్యాచ్ సెప్టెంబర్ 25న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సిరీస్ తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికాతో కూడా సిరీస్ ఆడనుంది.