Viral Video: గంటకు 219 కి.మీ. వేగంతో బంతి విసిరిన బౌలర్.. షోయబ్ అక్తర్ ప్రపంచ రికార్డుకు బ్రేకులు?

|

Nov 20, 2021 | 3:16 PM

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో హసన్ అలీ 3 వికెట్లు తీశాడు. అతని బంతుల్లో ఒకదాని వేగాన్ని చూసి అభిమానులు ఖంగుతిన్నారు.

Viral Video: గంటకు 219 కి.మీ. వేగంతో బంతి విసిరిన బౌలర్.. షోయబ్ అక్తర్ ప్రపంచ రికార్డుకు బ్రేకులు?
Bangladesh Vs Pakistan, 1st T20i Hasan Ali
Follow us on

Pakistan vs Bangladesh: టీ20 ప్రపంచకప్ 2021 సెమీఫైనల్‌లో మాథ్యూ వేడ్ క్యాచ్‌ను వదిలేసి విలన్‌గా మారిన హసన్ అలీ.. బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో హసన్ అలీ 3 వికెట్లు తీయగా, పాకిస్థాన్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అద్భుతంగా బౌలింగ్ చేసిన హసన్ అలీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. అయితే, తన అద్భుతమైన ప్రదర్శన సమయంలో, హసన్ అలీ బౌలింగ్ చేసిన బంతిని ప్రపంచం చూసి ఆశ్చర్యపోయింది. హసన్ అలీ వేసిన ఈ బంతి స్పీడ్ ఊహించడానికే కష్టంగా మారింది.

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో హసన్ అలీ గంటలకు 219 కిలోమీటర్లు వేగంతో బంతిని విసిరాడంటే మీరు నమ్ముతారా?.. కానీ, అది నిజం. రెండో ఓవర్ వేసిన హసన్ అలీ రెండో బంతిని 219 కి.మీ వేగంతో బంగ్లా బ్యాట్స్‌మెన్‌పై సంధించాడు. హసన్ అలీకి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దానిని చూసిన క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా బంతిని విసిరిన రికార్డు పాకిస్థాన్‌కు చెందిన షోయబ్ అక్తర్ పేరిట ఉందని మనకు తెలిసిందే. ఇంగ్లండ్‌పై గంటకు 161.3 కి.మీ. వేగంతో బంతి విసిరారు. హసన్ అలీ విసిరిన ఈ బంతి షోయబ్ అక్తర్ కంటే 60 కి.మీ. వేగవంతమైంది.

షోయబ్ అక్తర్ రికార్డును బ్రేక్ చేసిన హసన్ అలీ..!
హసన్ అలీ వేసిన ఈ బంతి స్పీడ్ చూసి.. షోయబ్ అక్తర్ రికార్డును బద్దలు కొట్టాడని అభిమానులు అంటున్నారు. స్పీడ్ మీటర్ లోపం కారణంగా హసన్ అలీ వేసిన బంతి గంటకు 219 కి.మీ. వేగంతో విసిరాడు. కానీ, షోయబ్ అక్తర్ రికార్డును హసన్ అలీ బద్దలు కొట్టాడు. ఈ బౌలర్ అద్భుతంగా పునరాగమనం చేశాడు. తొలి టీ20లో హసన్ అలీ 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. పవర్‌ప్లేలో హసన్ అలీ బంగ్లా బ్యాట్స్‌మెన్ నయీమ్‌ను అవుట్ చేసి, బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా, నూరుల్ హసన్ వికెట్లను కూడా పడగొట్టాడు.

కష్టపడి గెలిచిన పాకిస్తాన్..
తొలి టీ20లో బంగ్లాదేశ్‌పై గెలవడానికి పాకిస్థాన్ చాలా కష్టపడాల్సి వచ్చిందని మీకు తెలియజేద్దాం. పాకిస్థాన్ 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే ఫఖర్ జమాన్ 34, ఖుష్దిల్ షాల 34 పరుగులతో ఐదో వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యాన్ని కొనసాగించారు. చివరి మూడు ఓవర్లలో పాకిస్థాన్‌కు 32 పరుగులు అవసరం కాగా, షాదాబ్ ఖాన్ 10 బంతుల్లో 21 నాటౌట్, మహ్మద్ నవాజ్ 8 బంతుల్లో 18 నాటౌట్ చేసి జట్టుకు విజయాన్ని అందించారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేయగా, పాకిస్థాన్ 4 బంతుల్లో 6 వికెట్లకు 132 పరుగులు చేసి విజయం సాధించింది.

 


Also Read: IND vs NZ: జెర్సీపై టేప్‌ అంటించిన భారత యంగ్ బ్యాట్స్‌మెన్.. ఎందుకో తెలుసా?

Cricket: ఆసీస్‌ టెస్ట్‌ కెప్టెన్‌ అతనే.. త్వరలో అధికారిక ప్రకటన చేయనన్న సీఏ..