Viral Photo: స్వీట్‌కార్న్ అమ్మేది టీమిండియా టెస్ట్ సారథేనా? నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటో

Virat Kohli: విరాట్ కోహ్లీలా కనిపిస్తున్న ఓ వ్యక్తి ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ ఫోటోపై కోహ్లీ అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు.

Viral Photo: స్వీట్‌కార్న్ అమ్మేది టీమిండియా టెస్ట్ సారథేనా? నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటో
Virat Kohli

Updated on: Jan 03, 2022 | 9:13 AM

Viral Photo: నెట్టింట్లో ఆటగాడు, నాయకుడు లేదా నటుడి రూపాలు ఎన్నో తెగ వైరల్ అవుతంటాయి. కొద్దిరోజుల క్రితం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఫోటో ఒకటి వైరల్ అయిన సంగతి తెలసిందే. తాజాగా అచ్చం విరాట్ కోహ్లీ లాంటి వ్యక్తి ఫొటో ఒకటి తెగ వైరల్ అవుతోంది. వాగ్ గ్వాలియర్‌కు చెందిన చాట్ విక్రేతగా పని చేస్తోన్న ఓ వ్యక్తి అచ్చం టీమిండియా టెస్ట్ సారథి విరాట్ కోహ్లీలానే ఉన్నాడు. దీనిపై అనేక రకాల రియాక్షన్స్ కూడా వస్తున్నాయి.

విరాట్ కోహ్లీ లుక్‌కి సంబంధించిన ఫోటోను యో యో ఫన్నీ సింగ్ అనే హ్యాండిల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి ముఖం చూస్తే అచ్చం కోహ్లిలా కనిపిస్తున్నాడు. తలపై నల్లటి టోపీ ధరించి, నలుపు, ఎరుపు రంగు స్వెటర్ ధరించి ఉన్నాడు. ఓ బండిపై మొక్కజొన్నలు విక్రయిస్తున్నాడు. ఇప్పటివరకు 2500 మందికి పైగా ఈ ఫోటోను లైక్ చేశారు. చాలా మంది కామెంట్లు కూడా చేశారు. కోహ్లీ లుక్‌కి సంబంధించిన ఈ ఫోటో ట్విట్టర్‌తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తెగ వైరల్ అవుతుంది.

ఇంతకు ముందు కూడా, కోహ్లికి సంబంధించిన మరొక ఫోటో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అదే సమయంలో, రోహిత్ శర్మ, అరవింద్ కేజ్రీవాల్, సల్మాన్ ఖాన్‌తో సహా చాలా మంది సెలబ్రిటీల వలె కనిపించే వ్యక్తుల ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Also Read: IND vs SA 2nd Test: జోహన్నెస్‌బర్గ్ టెస్ట్‌లో కీలక మార్పు.. టీమిండియా ప్లేయింగ్ XIలో మరో బ్యాట్స్‌మెన్‌కు అవకాశం?

Viral Video: 4 ఓవర్లు.. 3 వికెట్లు.. ఒక మెయిడిన్.. అరంగేట్రంలో అద్భుత బౌలింగ్.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో