
Vaibhav Suryavanshi : క్రికెట్‌లో ఆటగాళ్లకు ఇష్టమైన ఫుడ్ దొరకకపోతే..ఆ కోపం ఎవరి మీద చూపించాలి ? యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. వైభవ్ సూర్యవంశీకి మటన్, రైస్ అంటే చాలా ఇష్టం. కానీ, క్రికెట్ కెరీర్ కోసం డైటింగ్ మొదలుపెట్టిన వైభవ్.. ఇప్పుడు తన ఫేవరెట్ ఫుడ్‌కు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఆ కోపమే ఇప్పుడు అతని బ్యాట్‌లో కనిపిస్తోందట. రైజింగ్ స్టార్ ఆసియా కప్‌లో ఆడుతున్న భారత జట్టుకు వైభవ్ కోపం బాగానే పనికొస్తోంది. మటన్ తిననందుకు వచ్చిన కోపాన్ని వైభవ్.. బౌలర్ల మీద, ప్రత్యర్థుల మీద చూపిస్తున్నాడు.
వైభవ్ సూర్యవంశీ పెద్ద అన్నయ్య అయిన ఉజ్వల్ సూర్యవంశీ ఈ విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో నవ్వుతూ చెప్పారు. “క్రికెట్‌లో బాగా రాణించడానికి వైభవ్ తన తిండి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. డైటింగ్ స్టార్ట్ చేసి మటన్, రైస్ తినడం మానేశాడు. మటన్ తినకుండా ఉండడంతో వైభవ్ చాలా కోపంగా ఉన్నాడు. ఆ కోపాన్ని అతను బౌలర్ల మీద చూపిస్తున్నాడు. ఆ కోపానికి బౌలర్లు బలవుతున్నారు” అని ఆయన అన్నారు. అంటే.. వైభవ్ తన ఫేవరెట్ ఫుడ్ కోల్పోయిన కోపాన్ని ప్రత్యర్థి బౌలర్లపై సిక్సర్లు, ఫోర్ల రూపంలో చూపిస్తున్నాడన్నమాట.
రైజింగ్ స్టార్ ఆసియా కప్‌లో వైభవ్ సూర్యవంశీ తన మొదటి మ్యాచ్‌లోనే పెద్ద విధ్వంసం సృష్టించాడు. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో అతను కేవలం 42 బంతుల్లోనే 15 సిక్సర్లు, 11 ఫోర్ల సహాయంతో 144 పరుగులు చేశాడు. దీంతో టీ20 ఫార్మాట్‌లో ఒక దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన బ్యాట్స్‌మన్గా రికార్డు సృష్టించాడు. వైభవ్ బ్యాటింగ్ చూస్తే, అతను మటన్ తిననందుకు ఎంత కోపంగా ఉన్నాడో అర్థమవుతుంది. యూఏఈ తర్వాత ఇప్పుడు వైభవ్ సూర్యవంశీని పాకిస్తాన్ జట్టు ఎదుర్కోవాల్సి ఉంది. గత మ్యాచ్‌లో వైభవ్ బ్యాటింగ్ చేసిన తీరు చూస్తే, పాకిస్తాన్ బౌలర్లకు ఇది మంచి వార్త కాదు. అన్నయ్య ఉజ్వల్ చెప్పినట్లుగా వైభవ్ తన మటన్ కోపాన్ని పాకిస్తాన్ బౌలర్లపై కూడా చూపిస్తే.. పాకిస్తాన్ జట్టుకు కష్టాలు తప్పవు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..