Vaibhav Sooryavanshi: బుడ్డోడి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీమిండియాలోకి ఆయా షేర్? ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడంటే..?

ఐపీఎల్ 2026లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవన్షీ త్వరలోనే టీమిండియా టీ20 జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్ టీ20 వరల్డ్ కప్, ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని యువ ప్రతిభకు ప్రాధాన్యం ఇస్తున్న సెలెక్టర్లు అతనిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.

Vaibhav Sooryavanshi: బుడ్డోడి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీమిండియాలోకి ఆయా షేర్? ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడంటే..?
Vaibhav Sooryavanshi

Updated on: Jun 05, 2026 | 1:10 PM

పట్టుమని 16 ఏళ్లు లేవు కానీ.. కొమ్ములుతిరిగి బౌలర్లను ఊచకోత కోశాడు. విధ్వంసానికి మరో అర్ధాన్ని చెబుతూ.. తన బ్యాటింగ్ పవరేంటో ప్రపంచానికి తెలియజేశాడు. ఐపీఎల్ 2025లో తన బ్యాటింగ్ ట్రైలర్ చూసించిన వైభవ్ సూర్యవన్షీ.. తాజా ఐపీఎల్ 2026లో అసలు సినిమా చూపించాడు. వామ్మో.. ఆ బుడ్డోడికి బౌలింగ్ వేయాలా? అని హేమాహేమీ బౌలర్లు భయపడేంతగా తన విశ్వరూపం ప్రదర్శించాడు. అసలు భయం అంటే ఏంటో తనకు తెలియదని, బౌలర్‌లకు రెస్పెక్ట్ ఇవ్వడం రాదన్నట్లు బ్యాటింగ్ చేశాడు. అందుకే ఈ 15 ఏళ్ల కుర్రాడు ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్ 2026లో అతని పవర్ హిట్టింగ్ చూసి.. అర్జెంట్‌గా టీమిండియా టీ20 టీమ్‌లోకి తీసుకోండంటూ అభిమానులు గోల పెట్టారు.

సాధారణ ప్రేక్షకులతో పాటు టీమిండియా సెలెక్టర్లు సైతం వైభవ్ బ్యాటింగ్‌కు ఫిదా అయిపోయినట్లు ఉన్నారు. అందుకే రాబోయే టీ20 సిరీస్‌లలో వైభవ్ సూర్యవన్షీకి జట్టులో స్థానం కల్పించాలని డిసైడ్ అయినట్లు విశ్వనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. పైగా టీ20 వరల్డ్ కప్ 2028, ఒలింపిక్స్ 2028 కోసం కూడా ఒక స్ట్రాంగ్ టీమ్‌ను బిల్డ్ చేసే పనిలో భాగంగా వైభవ్ లాంటి యంగ్ ప్యూర్ టాలెంట్‌ను కచ్చితంగా ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో అతన్ని వీలైనంత త్వరగా టీమిండియాలోకి తీసుకురావాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. దాంతో అందరూ కోరుకున్నట్లుగా వైభవ్ త్వరలోనే బ్లూ జెర్సీ ధరించి దేశం తరఫున తన తొలి మ్యాచ్ ఆడేందుకు రెడీ అవుతున్నాడు.

ఐపీఎల్‌లో రికార్డుల మోత..

వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 రికార్డుల విషయానికి వస్తే.. 16 ఇన్నింగ్స్‌లలో అసాధారణమైన 237.30 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకున్నాడు. అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అలాగే క్రిస్ గేల్ పేరిట ఉన్న 59 సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టి, ఒకే సీజన్‌లో ఏకంగా 72 సిక్సర్లు బాదాడు. ప్రతి 4.5 బంతులకు ఒక సిక్సర్ కొట్టడం విశేషం. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా (కేవలం 440 బంతుల్లో) 1,000 పరుగుల మైలురాయిని చేరుకుని ఆండ్రీ రసెల్ రికార్డును బద్దలు కొట్టాడు. కేవలం పవర్‌ప్లే (మొదటి 6 ఓవర్లలో) లోనే 521 పరుగులు చేసి, ఈ ఘనత సాధించిన తొలి టీ20 బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో ఫీల్డింగ్‌లో క్యాచ్ పట్టిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. మొత్తంగా ఐపీఎల్ 2026లో వైభవ్ ఆరెంజ్ క్యాప్, మోస్ట్ వ్యాల్యూబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్, సూపర్ స్ట్రైకర్, సూపర్ సిక్సెస్ అవార్డులను సొంతం చేసుకున్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us