Vaibhav Suryavanshi: రికార్డులకే దడపుట్టిస్తోన్న వండర్ కిడ్.. 15 ఏళ్ల వయసులోనే ఇదేం రచ్చ బుడ్డోడా.!

Vaibhav Suryavanshi Records: సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ 1000 టీ20 పరుగుల మైలురాయిని చేరుకున్న వైభవ్. అత్యంత తక్కువ వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కేవలం 26 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించడం అతని నిలకడకు నిదర్శనం. మైదానంలో ఎక్కడ ఫీల్డింగ్ పెట్టాలో తెలియక ప్రత్యర్థి కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తలపట్టుకోవడం ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

Vaibhav Suryavanshi: రికార్డులకే దడపుట్టిస్తోన్న వండర్ కిడ్.. 15 ఏళ్ల వయసులోనే ఇదేం రచ్చ బుడ్డోడా.!
Vaibhav Suryavanshi

Updated on: Apr 26, 2026 | 6:10 AM

Vaibhav Suryavanshi Records: క్రికెట్ మైదానంలో బ్యాట్ పట్టుకుని ఒక పసివాడు దిగితే.. సాధారణంగా బౌలర్లు కనికరం చూపిస్తారేమో అనిపిస్తుంది. కానీ, ఇక్కడ సీన్ రివర్స్. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ క్రీజులోకి వస్తే చాలు, ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పడుతున్నాయి. జైపూర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రాజస్థాన్ రాయల్స్ యువ కెరటం సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. రికార్డులను వేటాడటం కాదు, ఏకంగా వాటిని తన ఇంటి పేరుగా మార్చుకుంటున్నాడు ఈ బుడతడు.

సిక్సర్ల సునామీ.. 36 బంతుల్లోనే శతకం!

సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నప్పుడు, అది తన పాలిట పీడకలగా మారుతుందని ఊహించి ఉండడు. వైభవ్ సూర్యవంశీ కేవలం 36 బంతుల్లోనే తన రెండో ఐపీఎల్ సెంచరీని పూర్తి చేశాడు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే మూడో అత్యంత వేగవంతమైన శతకం. గతంలో క్రిస్ గేల్ (30 బంతులు), మళ్ళీ తనే గత ఏడాది గుజరాత్ మీద చేసిన (35 బంతులు) సెంచరీల తర్వాత ఇదే అత్యుత్తమ ప్రదర్శన. అంతేకాదు, ఐపీఎల్‌లో ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు చేసిన తొలి అన్‌క్యాప్డ్ (భారత జట్టుకు ఆడని) ప్లేయర్‌గా వైభవ్ రికార్డు సృష్టించాడు.

6,6,6,4,4,4,4,4,4.. 16 నిమిషాల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.. ప్రపంచ రికార్డ్‌కే పిచ్చెక్కించిన ఆల్ రౌండర్.!

ఇవి కూడా చదవండి

వెయ్యి పరుగుల క్లబ్‌లో పిన్న వయస్కుడు..

ఈ మ్యాచ్‌లో వైభవ్ కేవలం సెంచరీతోనే ఆగలేదు. టీ20 ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచ మేటి ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. కేవలం 26 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. టీ20ల్లో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర పుటల్లోకెక్కాడు. సిక్సర్ల విషయంలోనూ క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. కేవలం 15 ఇన్నింగ్స్‌ల్లోనే 50 ఐపీఎల్ సిక్సర్లు పూర్తి చేసి, గేల్ (21 ఇన్నింగ్స్) కంటే చాలా ముందున్నాడు.

ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్..

ఈ ఇన్నింగ్స్‌లో 37 బంతుల్లో 103 పరుగులు చేసి అవుట్ అయిన వైభవ్, ప్రస్తుత సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ రేసులో కె.ఎల్. రాహుల్‌తో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు. ఇద్దరి ఖాతాలో 357 పరుగులు ఉన్నప్పటికీ, వైభవ్ స్ట్రైక్ రేట్ (234) చూస్తుంటే అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. 20 ఏళ్ల లోపు వయసులో ఐదుసార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఘనత కూడా ఇతనికే దక్కింది. ఈ పసివాడి బ్యాటింగ్ చూస్తుంటే, క్రికెట్ రికార్డుల పుస్తకాన్ని కొత్తగా ముద్రించాల్సి వస్తుందేమో అనిపిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us