Vaibhav Suryavanshi: బుడ్డోడి బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో వైభవ్ బుర్రపాడు ఇన్నింగ్స్.. రికార్డులను మడతెట్టేశాడుగా

SMAT 2025లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన వైభవ్.. నాలుగో మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ సాధించాడు. అదరగొట్టే బ్యాటింగ్‌తో కంబ్యాక్ ఇచ్చాడు. ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీ చూసేద్దాం మరి. ఓ సారి లుక్కేయండి.

Vaibhav Suryavanshi: బుడ్డోడి బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో వైభవ్ బుర్రపాడు ఇన్నింగ్స్.. రికార్డులను మడతెట్టేశాడుగా
Vaibhav

Updated on: Dec 02, 2025 | 1:54 PM

సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు సెంచరీతో అదరగొట్టాడు. SMAT 2025లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన తర్వాత మహారాష్ట్రతో జరిగిన నాలుగో మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన సెంచరీ సాధించాడు. తన సెంచరీని సిక్స్‌తో పూర్తీ చేశాడు. వైభవ్ సూర్యవంశీ తన బ్యాట్‌తో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో కేవలం 58 బంతుల్లోనే తన సెంచరీని సాధించాడు. మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో బీహార్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 3 వికెట్లకు 176 పరుగులు చేసింది. బీహార్ వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ ఒక్కడే అజేయంగా 108 పరుగులు చేశాడు. అతను కేవలం 61 బంతుల్లోనే 177 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో ఈ పరుగులు రాబట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు సిక్సర్లు, ఏడు ఫోర్లు ఉన్నాయి. బీహార్ తరపున వైభవ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేశాడు. అతడితో పాటు బిపిన్ సౌరభ్‌ మరో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. అయితే తక్కువ పరుగులకే సౌరభ్ పెవిలియన్ చేరాడు. అయితే మరో ఎండ్‌లో వైభవ్ సూర్యవంశీ మూడో వికెట్‌కు ఆకాష్ రాజ్‌తో కలిసి అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో తొలి సెంచరీ..

14వ ఓవర్ మూడో బంతికి వైభవ్ సూర్యవంశీ, ఆకాష్ రాజ్‌ల భాగస్వామ్యం కంచికి చేరింది. ఆ సమయానికి, బీహార్ స్కోరు 3 వికెట్లకు 101 పరుగులు మాత్రమే. కానీ వైభవ్ ఊచకోత ఆగలేదు. ఆకాష్ రాజ్ అవుట్ అయిన తర్వాత, వైభవ్ సూర్యవంశీ తన ఇన్నింగ్స్‌ గేర్ మార్చాడు. మొదట అర్ధ సెంచరీ మార్కును దాటగానే.. వేగంగా సెంచరీని పూర్తీ చేశాడు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో మొదటి మూడు మ్యాచ్‌ల్లో వైభవ్ సూర్యవంశీ కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, నాలుగో మ్యాచ్‌లో మహారాష్ట్రపై అతను అద్భుతమైన సెంచరీ సాధించడంతో భారత అండర్ 19 జట్టు ఊపిరి పీల్చుకుంది.