
Vaibhav Sooryavanshi : క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం అందరి దృష్టి 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మీదే ఉంది. ఓటు వేసే వయసు కూడా రాకముందే, ఇంటర్నేషనల్ లెవెల్లో వరల్డ్ క్లాస్ బౌలర్లను ఎదుర్కొంటూ, సులభంగా బౌండరీలు దాటించేస్తున్నారు. అయితే వైభవ్‌ను మిగతా యువ బ్యాటర్ల కంటే భిన్నంగా నిలబెట్టేది కేవలం అతను కొట్టే భారీ సిక్సర్లు లేదా అతని రన్ రేట్ మాత్రమే కాదు. అతని బ్యాటింగ్ వెనుక ఉన్న స్పష్టమైన ఆలోచనా విధానం. అతను పిచ్‌పై బ్లైండ్ అగ్రెషన్‌తో కాకుండా, పక్కా ప్రణాళికతో బౌలర్లపై ఎదురుదాడికి దిగుతాడు. మ్యాచ్‌ను కేవలం నెట్టుకురావడం కాకుండా, తన ఆధీనంలోకి తెచ్చుకోవడమే అతని స్టైల్.
ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 15 ఏళ్ల 99 రోజుల వయసులోనే బరిలోకి దిగి, భారతదేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. అతని హై-స్ట్రైక్ రేట్ బ్యాటింగ్ చూసి చాలామంది అది గుడ్డిగా బ్యాట్ తిప్పేస్తుంటాడని అనుకుంటారు. కానీ కోచ్‌లు, విశ్లేషకులు చెప్పేదాని ప్రకారం.. వైభవ్ బ్యాటింగ్ పూర్తిగా ప్రొయాక్టివ్. అంటే, రిస్క్‌లను ముందే లెక్కించడం, పక్కా బయోమెకానికల్ బ్యాట్ స్పీడ్ ఉపయోగించడం, మ్యాచ్ సిట్యుయేషన్‌ను బట్టి షాట్లు ఆడటం అతని స్పెషాలిటీ. ఐపీఎల్‌లో 228.95 స్ట్రైక్ రేట్, లిస్ట్-ఎ మ్యాచ్‌లో 324.14 స్ట్రైక్ రేట్ సాధించడం వెనుక అతని హిప్-షోల్డర్ సెపరేషన్, అద్భుతమైన రిస్ట్ వర్క్ దాగున్నాయి. గ్రౌండ్‌లో ప్రత్యర్థులు కవ్వించినా లొంగిపోకుండా, శ్రీలంక-ఎ పై 29 బంతుల్లో 94 రన్స్, ఐపీఎల్ 2026 ఎలిమినేటర్‌లో 29 బంతుల్లో 97 రన్స్‌తో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడి తన మెచ్యూరిటీని నిరూపించుకున్నాడు.
వైభవ్ బ్యాటింగ్ టెక్నిక్ చాలా వినూత్నంగా ఉంటుంది. ఇందులో బేస్ బాల్ తరహా రొటేషనల్ పవర్, ఎక్స్‌ట్రీమ్ హిప్-టు-ఫీల్డర్ సెపరేషన్, లాంగ్ బ్యాక్‌స్వింగ్ కనిపిస్తాయి. దీనివల్ల అతను ఊహించని రేంజ్‌లో బ్యాట్ స్పీడ్‌ను జనరేట్ చేయగలడు. పిచ్‌పై వైభవ్ చాలా వైడ్ స్టాన్స్ (కాళ్లు వెడల్పుగా పెట్టడం) తీసుకుంటాడు, దీనివల్ల అతనికి ఆఫ్‌సైడ్, లెగ్‌సైడ్ రెండు వైపులా షాట్లు కొట్టడానికి వీలవుతుంది. ఇక గుడ్ లెంత్ బాల్స్ వస్తే సింపుల్‌గా క్రీజ్ వెలుపలికి వచ్చి వాటిని ఫుల్‌టాస్‌లుగా మార్చి గాల్లోకి లేపేస్తాడు. ఫ్రంట్ ఫుట్ నుంచి బ్యాక్ ఫుట్‌కు వెయిట్ ట్రాన్స్‌ఫర్ చేయడం, బ్యాక్ షోల్డర్ అలైన్‌మెంట్ సరిగ్గా ఉండటం వల్లే అతనికి ఆ పర్ఫెక్ట్ అప్‌వర్డ్ స్వింగ్ లభిస్తుందని అతని చిన్ననాటి కోచ్ మనీష్ ఓఝా విశ్లేషించారు.
క్రికెట్ హిస్టరీలో ఎంతటి టాలెంట్ ఉన్నా సరైన నిర్ణయాలు తీసుకోకపోతే కెరీర్ త్వరగా ముగిసిపోతుంది. కానీ వైభవ్ తన బలహీనతలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవడంలో ముందున్నాడు. ఒకప్పుడు అతనికి షార్ట్ పిచ్ బంతులు లేదా బౌన్సర్లు ఆడటం బలహీనతగా ఉండేది. అయితే 2026 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై ఆడిన 80 బంతుల్లో 175 పరుగుల సంచలన ఇన్నింగ్స్ దీనికి సమాధానం ఇచ్చింది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లీష్ బౌలర్లు వైభవ్‌ను టార్గెట్ చేస్తూ వరుసగా బౌన్సర్లు వేసినప్పటికీ, అతను ఏమాత్రం భయపడకుండా క్రీజ్ వెలుపలికి వచ్చి, ఫాస్ట్ హ్యాండ్స్ ఉపయోగిస్తూ వాటిని స్వివెల్ పుల్ షాట్ల ద్వారా లెగ్‌సైడ్ బౌండరీ దాటించాడు.
మోడ్రన్ టీ20 క్రికెట్ కేవలం హిట్ అండ్ రన్ లాంటిది కాదు, అది 360-డిగ్రీల పవర్ హిట్టింగ్ గేమ్. ఈ జనరేషన్‌లో వైభవ్ సూర్యవంశీ హై-రిస్క్ ఇంటెంట్‌తో సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తున్నాడు. ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్‌పై 47 బంతుల్లో 96 రన్స్ చేసిన ఇన్నింగ్స్ అతని క్లాస్‌కు నిదర్శనం. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ వరుసగా వికెట్లు కోల్పోతున్నప్పుడు, వైభవ్ అటాకింగ్ ఆపేసి సింగిల్స్ తీస్తూ ఇన్నింగ్స్‌ను కంట్రోల్ చేశాడు. వయసు చిన్నదే అయినా ఒక మ్యాచ్‌ను ఎలా నడిపించాలో, గేర్లు ఎలా మార్చాలో అతనికి బాగా తెలుసు. రాబోయే రోజుల్లో బౌలర్లు అతనిపై కొత్త వ్యూహాలతో వచ్చినా, వాటిని ఎదుర్కొని నిలబడే సత్తా ఈ వండర్ కిడ్‌కు ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..