Vaibhav Sooryavanshi : ఆక్షన్ టైంలో నా గుండె పగిలింది.. రూ.1.10 లక్షలకు అమ్ముడైనా.. వైభవ్ ఎందుకు అంతగా ఫీలయ్యాడు?

Vaibhav Sooryavanshi : 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ ఆక్షన్ సమయంలో కేవలం రెండు టీమ్స్ మాత్రమే తనను కొనుగోలు చేయడంపై బాధపడ్డాడు. అయితే రాజస్థాన్ రాయల్స్‌లో చేరిన తర్వాత కుటుంబంలా అనిపిస్తోందని, సపోర్ట్ స్టాఫ్, సీనియర్ల సహకారం ఎంతో ఉందని వెల్లడించాడు.

Vaibhav Sooryavanshi : ఆక్షన్ టైంలో నా గుండె పగిలింది.. రూ.1.10 లక్షలకు అమ్ముడైనా.. వైభవ్ ఎందుకు అంతగా ఫీలయ్యాడు?
Vaibhav Sooryavanshi

Updated on: Jun 07, 2026 | 4:29 PM

Vaibhav Sooryavanshi : తక్కువ కాలంలోనే తన తుపాన్ బ్యాటింగ్‌తో భారత క్రికెట్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు 15 ఏళ్ల యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) తరపున ఆడుతూ ఏకంగా 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే 237.30 స్ట్రైక్ రేట్‌తో విరుచుకుపడి టీమిండియాలోనూ చోటు సంపాదించాడు. అయితే ఇంతటి ఘనత సాధించిన ఈ యంగ్ ప్లేయర్.. ఐపీఎల్ 2025 ఆక్షన్ సమయంలో తాను పడ్డ మానసిక వేదన గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఆక్షన్ రోజున జరిగిన ఒక సంఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పుకొచ్చాడు.

రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసిన ఇంటర్వ్యూలో వైభవ్ సూర్యవంశీ తన ఆవేదనను పంచుకున్నాడు. “నిజం చెప్పాలంటే, ఆక్షన్ టైమ్‌లో నా పేరు వచ్చినప్పుడు కేవలం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే నా కోసం పోటీ పడ్డాయి. చివరకు నన్ను ఆర్ఆర్ కోటి పది లక్షలకు దక్కించుకుంది. కానీ ఆ క్షణంలో నేను చాలా బాధపడ్డాను. నేను బాగా ఆడుతున్నాను కదా, ట్రయల్స్‌లోనూ నా టాలెంటును నిరూపించుకున్నాను కదా.. మరి కేవలం రెండు టీమ్స్ మాత్రమే నాపై ఆసక్తి ఎందుకు చూపించాయి? మిగతా టీమ్స్ ఎందుకు ముందుకు రాలేదు? అని ఆలోచించి తీవ్రంగా కృంగిపోయాను” అని వైభవ్ తన మనసులోని మాటను బయటపెట్టాడు.

అయితే, రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో చేరిన తర్వాత తన ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని వైభవ్ తెలిపాడు. “గడిచిన ఏడాదిన్నర కాలంగా నేను ఈ టీమ్‌తో ఉన్నాను. నిజాయితీగా చెబుతున్నాను.. నన్ను రాజస్థాన్ వంటి గొప్ప టీమ్‌లోకి తీసుకున్నందుకు దేవుడికి వెయ్యి సార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఇక్కడి కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్, ప్లేయర్లు, మేనేజ్మెంట్.. ఇలా అందరూ నన్ను సొంత ఫ్యామిలీ మెంబర్లా చూసుకుంటున్నారు. టీమ్ మేనేజర్ రోమీ భిండర్ నుంచి ఫిజియోల వరకు ప్రతి ఒక్కరూ నాకు ఎంతో సపోర్టు ఇస్తున్నారు” అని వైభవ్ సంతోషం వ్యక్తం చేశాడు.

రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలో ఉంటే ఒక క్రికెట్ టీమ్‌లో ఉన్నట్లు కాకుండా, ఇంట్లోనే ఉన్నట్లు అనిపిస్తుందని వైభవ్ సూర్యవంశీ పేర్కొన్నాడు. “ఆర్ఆర్ లో అందరూ ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు. మనసులో ఏదైనా బాధ ఉన్నా లేదా ఏదైనా సమస్య ఇబ్బంది పెడుతున్నా ఎవరితోనైనా ధైర్యంగా షేర్ చేసుకోవచ్చు. సీనియర్ ఆటగాళ్లు నన్ను ఎప్పుడూ గైడ్ చేస్తుంటారు. ఒక ప్రొఫెషనల్ క్రికెటర్‌గా నేను ఏవి చేయాలి, ఏవి చేయకూడదు అనే విషయాల్లో సీనియర్స్ నుంచి చాలా నేర్చుకుంటున్నాను. ఈ ఫ్రాంచైజీలో భాగమైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను” అని ఈ యువ ఓపెనర్ వివరించాడు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us