GG vs UP-WPL 2023: గుజరాత్ జెయింట్స్ ఖాతాలో రెండో ఓటమి.. ఉత్కంఠ పోరులో యూపీ వారియర్స్ అనూహ్య విజయం..

మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో మొదటి మ్యాచ్‌లోనే ముంబై చేతిలో దెబ్బ తిన్న గుజరాత్ తన అపజయాల పరంపరను కొనసాగిస్తోంది. ఆదివారం జరిగిన ఉత్కంఠ..

GG vs UP-WPL 2023: గుజరాత్ జెయింట్స్ ఖాతాలో రెండో ఓటమి.. ఉత్కంఠ పోరులో యూపీ వారియర్స్ అనూహ్య విజయం..
Up Warriors Beat Gujarat Giants By 3 Wickets

Updated on: Mar 06, 2023 | 6:00 AM

ముంబై: మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో మొదటి మ్యాచ్‌లోనే ముంబై చేతిలో దెబ్బ తిన్న గుజరాత్ తన అపజయాల పరంపరను కొనసాగిస్తోంది. ఆదివారం జరిగిన ఉత్కంఠ భరింత మ్యాచ్‌లో కూడా యూపీ వారియర్స్‌పై గుజరాత్‌ జెయింట్స్ జట్టు 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ విజయంతో యూపీ జట్టు పాయింట్ల ఖాతాను తెరవడంతో పాటు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ముందుగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన యూపీ జట్టు 170 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ఈ క్రమంలో యూపీ తరఫున కిరణ్ నవ్‌గిరే(53; 43 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా.. చివర్లో వచ్చిన గ్రేస్ హ్యారిస్(59;  26 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడింది. యూపీ విజయానికి ఆఖరి ఓవర్లో 19 పరుగులు అవసరం అయిన తరుణంలో.. గ్రేస్‌ రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లు బాది ఒక బంతి మిగిలుండగానే తన జట్టును విజయతీరాలకు చేర్చింది. ఇంకా ఎక్లెస్టోన్(22; 12 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) ఆమెకు సహకారం అందించింది. అయితే యూపీ క్రికెటర్లలో అలీసా హీలే (7), శ్వేతా సెహ్రావత్ (5),  తాహిలా మెక్‌గ్రాత్‌ (0), దీప్తి శర్మ (11), సిమ్రాన్ షేక్ (0), దేవికా వైద్య (4) విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో కిమ్ గార్త్ (5/16) ఆకట్టుకోగా.. మాన్సీ జోషి, అనాబెల్ ఒక వికెట్ పడగొట్టింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..