BCCI New IPL Rule: ఇకపై వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ ఆడలేడా.. ఊహించని షాకిచ్చిన బీసీసీఐ..?

IPL New Rule, U-16 Cricketers: ఐపీఎల్‌కు సంబంధించి బీసీసీఐ కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. దీని వలన వైభవ్ సూర్యవంశీ వంటి అండర్-16 క్రికెటర్లు టీ20 లీగ్‌లో ఆడకుండా నిరోధించారు. దీంతో ఊహించని షాకిచ్చింది. ఆ నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

BCCI New IPL Rule: ఇకపై వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ ఆడలేడా.. ఊహించని షాకిచ్చిన బీసీసీఐ..?
Ipl Bcci New Rule

Updated on: Sep 28, 2025 | 4:56 PM

IPL Rule, U-16 Cricketers: ఐపీఎల్‌లో ఆడటం అనేది భారతదేశంతోపాటు ప్రపంచంలోని ప్రతి వర్ధమాన క్రికెటర్ కల. ఆటగాళ్ళు చిన్న వయస్సులోనే ఈ లీగ్‌లో ఆడాలని కోరుకుంటారు. తద్వారా పేరుతోపాటు తగిన గుర్తింపును పెంచుకోవచ్చు. వైభవ్ సూర్యవంశీ కూడా 13 సంవత్సరాల వయస్సులో ఈ లీగ్‌లో గుర్తింపు పొందాడు. నేడు అతని స్థాయి ఎంత పెరిగిందో తెలిసిందే. అయితే, IPLలో ఆడటం అండర్-16 క్రికెటర్లకు అంత సులభం కాదు. ఇప్పుడు, వారు వైభవ్ సూర్యవంశీ లాగా IPLలో ఆడలేరు. దీని వెనుక ప్రధాన కారణం బీసీసీఐ కొత్త నియమం.

బీసీసీఐ కొత్త ఐపీఎల్ నిబంధనలు..

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే బీసీసీఐ కొత్త నియమం ఏమిటి, దీని కారణంగా భారతదేశంతోపాటు, ప్రపంచ వ్యాప్తంగా అండర్-16 క్రికెటర్లు నేరుగా IPLలో ఆడలేరు. IPLలో ఆడాలంటే, అండర్-16 క్రికెటర్లు ఇప్పుడు కనీసం ఒక ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో అనుభవం కలిగి ఉండాలి. ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు లేకుండా, వారు IPLలో ఆడటానికి అర్హులు కారు. ఈ కొత్త నియమాన్ని సెప్టెంబర్ 28న జరిగిన బీసీసీఐ ఏజీఎంలో ఆమోదించారు.

గతంలో, ఐపీఎల్‌లో పాల్గొనే ఆటగాళ్లకు వయో పరిమితులు లేదా ప్రత్యేక నియమాలు లేవు. అయితే, బీసీసీఐ ఇప్పుడు ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడటం తప్పనిసరి చేసింది. నివేదికల ప్రకారం, కనీసం ఒక ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడిన ఆటగాళ్లు మాత్రమే ఐపీఎల్ ప్రవేశానికి అర్హులు.

ఇవి కూడా చదవండి

వైభవ్ సూర్యవంశీ 13 సంవత్సరాల వయసులో ఎంట్రీ..

ఐపీఎల్‌లో ఆడే అతి పిన్న వయస్కుడైన ఆటగాడు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ 2025 వేలంలో రాజస్థాన్ రాయల్స్ అతన్ని రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. రాజస్థాన్ అతన్ని కొనుగోలు చేసినప్పుడు అతని వయస్సు కేవలం 13 సంవత్సరాల 243 రోజులు. విశేషమేమిటంటే, ఐపీఎల్‌లో ఆడినప్పుడు వైభవ్ సూర్యవంశీకి ఇప్పటికే ఫస్ట్ క్లాస్ అనుభవం ఉంది. వైభవ్ సూర్యవంశీ మాదిరిగానే, అనేక ఇతర అండర్-19 క్రికెటర్లు ఆయుష్ మాత్రే, ముషీర్ ఖాన్, ఆండ్రీ సిద్ధార్థ్ వంటి వివిధ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..