U19 World Cup Final 2024: ప్చ్.. మళ్లీ నిరాశే.. అండర్‌ 19 ప్రపంచకప్‌ విజేతగా ఆస్ట్రేలియా.. ఫైనల్‌లో భారత్‌ బోల్తా

ప్చ్‌.. ఫలితం ఏం మారలేదు. సీనియర్‌ జట్టులాగే భారత యువ జట్టు ఆస్ట్రేలియా అడ్డుగోడను అధిగమించలేకపోయింది. ప్రపంచకప్‌ టోర్నీలో అన్ని మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌ కు చేరుకున్న యంగ్‌ టీమిండియా ఫైనల్‌ ఫోబియాను మాత్రం అధిగమించలేకపోయింది. ఆదివారం (ఫిబ్రవరి 09) జరిగిన అండర్‌ 19 ప్రపంచకప్‌ ఫైనల్‌ లో భారత్‌ పరాజయం పాలైంది.

U19 World Cup Final 2024: ప్చ్.. మళ్లీ నిరాశే.. అండర్‌ 19 ప్రపంచకప్‌ విజేతగా ఆస్ట్రేలియా.. ఫైనల్‌లో భారత్‌ బోల్తా
India U19 Vs Australia U19
Follow us

|

Updated on: Feb 11, 2024 | 9:19 PM

ప్చ్‌.. ఫలితం ఏం మారలేదు. సీనియర్‌ జట్టులాగే భారత యువ జట్టు ఆస్ట్రేలియా అడ్డుగోడను అధిగమించలేకపోయింది. ప్రపంచకప్‌ టోర్నీలో అన్ని మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌ కు చేరుకున్న యంగ్‌ టీమిండియా ఫైనల్‌ ఫోబియాను మాత్రం అధిగమించలేకపోయింది. ఆదివారం (ఫిబ్రవరి 09) జరిగిన అండర్‌ 19 ప్రపంచకప్‌ ఫైనల్‌ లో భారత్‌ పరాజయం పాలైంది. ఆస్ట్రేలియా విధించిన 254 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక యంగ్‌ టీమిండియా చతికిలపడింది.  43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలింది. దీంతో ఆరోసారి విశ్వవిజేతగా నిలవాలన్న టీమిండియా కల నెరవేరలేదు. టోర్నీలో నిలకడగా రాణించిన ఆసీస్‌ ఫైనల్‌ లో భారత్‌ ను చిత్తు చేసి మరోసారి ప్రపంచకప్‌ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. గతేడాది నవంబర్‌ 19న వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో సీనియర్‌ ఆటగాళ్ల ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటారనుకుంటే.. కుర్రాళ్లూ  కూడా క్రికెట్ అభిమానులకు నిరాశే మిగిల్చారు.

ఇవి కూడా చదవండి

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించిన భారత జట్టు మరోసారి ఫైనల్ ఫోబియాను అధిగమించలేకపోయింది.  ఆ స్ట్రేలియా  బౌలర్ల ధాటికి 174 పరుగులకే ఆలౌట్‌ కావడంతో 79 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో రికార్డు స్థాయిలో 6వ సారి ఛాంపియన్‌గా నిలిచే అవకాశాన్ని కోల్పోయింది టీమిండియా.  ఈ భారీ ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా బ్యాటింగ్ పూర్తిగా ఒత్తిడికి గురై ఫ్లాప్ అయింది. మూడో ఓవర్‌లోనే టీమ్‌ఇండియా తొలి వికెట్‌ పడగా, ఆ తర్వాత ఒక్కో క్కరూ పెవిలియన్ కు క్యూ కట్టారు. ఆదర్శ్ సింగ్ మాత్రమే 47 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు ఈ ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు కాగా.. ఆఖరి మ్యాచ్‌లో ఉదయ్ సహారన్, ముషీర్ ఖాన్, సచిన్ దాసా విఫలమయ్యారు. ఫైనల్లో ముషీర్ ఖాన్ 22 పరుగుల వద్ద, ఉదయ్ సహారన్ 8 పరుగుల వద్ద, సచిన్ దస్ 9 పరుగుల వద్ద ఔట్ కావడంతో టీమిండియా ప్రపంచకప్ కల చెదిరిపోయింది.

చివర్లో మురుగన్ అభిషేక్ (42), నమన్ తివారీ (14)లు టీమ్ ఇండియాకు కొంత పోరాటాన్ని అందించారు, అయితే స్కోరు చాలా పెద్దది. దీంతో భారత జట్టు 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటయి 79 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

ఆస్ట్రేలియా U19 (ప్లేయింగ్ XI): హ్యారీ డిక్సన్, సామ్ కొన్‌స్టాస్, హ్యూ వీబ్‌జెన్(కెప్టెన్), హర్జాస్ సింగ్, ర్యాన్ హిక్స్(కీపర్), ఆలివర్ పీక్, రాఫ్ మాక్‌మిల్లన్, చార్లీ ఆండర్సన్, టామ్ స్ట్రాకర్, మహ్లీ బార్డ్‌మాన్, కల్లమ్ విడ్లర్.

ఇండియా U19 (ప్లేయింగ్ XI): ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్(కెప్టెన్), ప్రియాంషు మోలియా, సచిన్ దాస్, ఆరవెల్లి అవనీష్(కీపర్), మురుగన్ అభిషేక్, రాజ్ లింబానీ, నమన్ తివారీ, సౌమీ పాండే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్