U-19 Women’s World Cup: టీ20 ప్రపంచకప్‌ విజయంతో 16 ఏళ్ల రికార్డు బద్దలు.. ధోని సరసన టీమిండియా కెప్టెన్‌ షెఫాలీ

|

Jan 29, 2023 | 9:13 PM

ఇంతకుముందు, మిథాలీ రాజ్ కెప్టెన్సీలో, భారత సీనియర్ మహిళల జట్టు 2005, 2017లో వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌లో ఆడారు. అలాగే హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో T20 ప్రపంచకప్‌ను ఆడింది కానీ ప్రపంచకప్‌ను మాత్రం ముద్దాడలేకపోయారు. ఇప్పుడు ఆ లోటును షెఫాలీ వర్మ తీర్చింది.

U-19 Women’s World Cup: టీ20 ప్రపంచకప్‌ విజయంతో 16 ఏళ్ల రికార్డు బద్దలు.. ధోని సరసన టీమిండియా కెప్టెన్‌ షెఫాలీ
Indian Women Cricket Team
Follow us on

షెఫాలీ వర్మ సారథ్యంలోని భారత మహిళా క్రికెట్ జట్టు ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై భారత జట్టు విజయం సాధించింది. దీంతో మహిళల విభాగంలో భారత్ తొలి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఇంతకుముందు, మిథాలీ రాజ్ కెప్టెన్సీలో, భారత సీనియర్ మహిళల జట్టు 2005, 2017లో వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌లో ఆడారు. అలాగే హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో T20 ప్రపంచకప్‌ను ఆడింది కానీ ప్రపంచకప్‌ను మాత్రం ముద్దాడలేకపోయారు. ఇప్పుడు ఆ లోటును షెఫాలీ వర్మ తీర్చింది. టోర్నమెంట్ ఆద్యంతం అద్భుతంగా రాణించి ప్రపంచకప్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయింది. సూపర్-6 స్టేజ్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఓడిపోయింది. ఈ పరాజయాన్ని తప్పనిస్తే ఎక్కడ కూడా టీమిండియా తలొగ్గలేదు. మేటి జట్లను సైతం సులభంగా మట్టికరిపించింది. కాగా ఈవిజయంలో టీమిండియా కెప్టెన్‌ షెఫాలీ వర్మ అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకుంది. అదంటంటే.. 2007లో దక్షిణా ఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌ను ధోనీ కైవసం చేసుకున్నాడు.

ఈ టోర్నీలో షెఫాలీ వర్మ బ్యాటింగ్‌పై చాలా అంచనాలు ఉన్నాయి. అయితే కెప్టెన్‌గా ఆకట్టుకున్న ఆమె బ్యాటింగ్‌లో మాత్రం మెరుపులు మెరిపించేలేదు. ఏడు మ్యాచ్‌ల్లో కేవలం 172 పరుగులు చేసింది. అయితే ఈ లోటును పూడుస్తూ మరో ఓపెనర్‌ శ్వేత ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌ర్‌గా నిలిచింది. ఆమె మూడు అర్ధ సెంచరీల సహాయంతో ఏడు మ్యాచ్‌ల్లో 99 సగటుతో 297 పరుగులు చేసింది. ఇక ఈ టోర్నమెంట్‌లో టీమిండియా స్పి్న్నర్లు అద్భుతాలే చేశారు. అన్ని మ్యాచ్‌ల్లోనూ నిలకడగా వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..