IPL 2027: ఐపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ దొరికాడ్రోయ్.. కోట్ల వర్షం పక్కా..!

IPL 2027 Auction Uncapped Player: దేశవాళీ లీగ్‌లో పరుగుల వరద పారిస్తున్న తుషార్ రహేజా ఆటతీరు ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని గట్టిగా ఆకర్షిస్తోంది. ఇదే జోరును కొనసాగిస్తే త్వరలో జరగబోయే మినీ వేలంలో అన్‌క్యాప్డ్ కేటగిరీలో అతనికి భారీ ధర పలకడం ఖాయంగా కనిపిస్తోంది.

IPL 2027: ఐపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ దొరికాడ్రోయ్.. కోట్ల వర్షం పక్కా..!
Ipl 2027 Auction Uncapped Player Tushar Raheja

Updated on: Aug 22, 2026 | 9:10 AM

IPL 2027 Auction Uncapped Player: తమిళనాడు ప్రీమియర్ లీగ్ వేదికగా ఓ యువ బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం ఆరు బంతుల వ్యవధిలోనే ఏకంగా ఐదు సిక్సర్లు బాది అందరినీ నివ్వెరపరిచాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో రాబోయే ఐపీఎల్ మినీ వేలంలో భారీ డిమాండ్ సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో ఐడ్రీమ్ తిరుప్పూర్ తమిళన్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్న 25 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ తుషార్ రహేజా మైదానంలో విధ్వంసం సృష్టించాడు. ఆగస్టు 20న జరిగిన 23వ లీగ్ మ్యాచ్‌లో మదురై పాంథర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ వేసిన స్పిన్ ఆల్‌రౌండర్ రోహన్ భూత్రా బౌలింగ్‌లో రహేజా మొదటి బంతినే సిక్సర్‌గా మలిచాడు. రెండో బంతి డాట్ అయినా, ఆ తర్వాత వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు భారీ సిక్సర్లు బాది స్టేడియాన్ని హోరెత్తించాడు. కేవలం 17 బంతుల్లోనే 7 సిక్సర్లతో 48 పరుగులు సాధించి జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు.

ఎక్కువమంది చదివినది: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 2027 వన్డే ప్రపంచకప్ జట్టులో వైభవ్‌కు చోటు.. ఓపెనర్లుగా ఎవరంటే?

ఒంటిచేత్తో గెలిపించిన ఇన్నింగ్స్..

తన మెరుపు ఇన్నింగ్స్‌తో కేవలం రెండు పరుగుల తేడాతో అర్ధశతకం చేజార్చుకున్నప్పటికీ, తుషార్ రహేజా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 282.35 స్ట్రైక్ రేట్‌తో సాగిన అతని ధనాధన్ బ్యాటింగ్ ప్రత్యర్థి బౌలర్ల లయను పూర్తిగా దెబ్బతీసింది. రహేజా దూకుడుతో తిరుప్పూర్ తమిళన్స్ జట్టు 158 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు మిగిలి ఉండగానే సునాయాసంగా ఛేదించింది. క్రీజులో ఉన్నంతసేపు ప్రత్యర్థి జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బౌండరీలతోనే సమాధానం చెప్పాడు.

ఇవి కూడా చదవండి

సీజన్ అంతటా నిలకడైన జోరు..

తుషార్ రహేజా కేవలం ఈ ఒక్క మ్యాచ్‌కే పరిమితం కాలేదు. ప్రస్తుత టీఎన్‌పీఎల్ సీజన్ మొత్తంలోనూ నిలకడగా పరుగులు రాబడుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 68.80 సగటు, దాదాపు 198 స్ట్రైక్ రేట్‌తో 344 పరుగులు సాధించాడు. ఇందులో ఒక భారీ సెంచరీతో పాటు రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఓపెనర్‌గా బరిలోకి దిగుతూ పవర్‌ప్లేను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడం రహేజా ఆటతీరులో ప్రత్యేకతగా కనిపిస్తోంది.

ఎక్కువమంది చదివినది: ఏడాది పాటు నిషేధం.. కట్‌చేస్తే.. 11 ఫోర్లు, 11 సిక్సర్లు.. 72 బంతుల్లో రికార్డుల ఊచకోత..!

ఐపీఎల్ 2027 మినీ వేలంలో భారీ డిమాండ్..?

దేశవాళీ లీగ్‌ల నుంచి వెలుగులోకి వచ్చి ఐపీఎల్‌లో స్టార్‌లుగా మారిన ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ నుంచి వెలుగులోకి వచ్చి పంజాబ్ కింగ్స్ జట్టుకు ఎంపికైన ప్రియాంశ్ ఆర్య లాంటి వారు దీనికి నిదర్శనం. గత వేలంలో ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మలను చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా చెరో రూ. 14.20 కోట్లకు సొంతం చేసుకుంది. ఎడమచేతి వాటం వికెట్ కీపర్ బ్యాటర్ కావడంతో పాటు కెప్టెన్సీ అనుభవం కూడా ఉన్న రహేజా కోసం కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడే అవకాశముంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us