Team India : టీమిండియాకు కోలుకోలేని దెబ్బ..వరల్డ్ కప్‌కు ముందు ముగ్గురు స్టార్ ప్లేయర్లకు గాయాలు

Team India : వరల్డ్ కప్ గెలవాలనే పట్టుదలతో ఉన్న భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. టోర్నీ మొదలవ్వడానికి ఇంకా కొద్దిరోజులే సమయం ఉండగా, ముగ్గురు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇది జట్టు కూర్పును దెబ్బతీయడమే కాకుండా, సెలక్టర్లకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది.

Team India : టీమిండియాకు కోలుకోలేని దెబ్బ..వరల్డ్ కప్‌కు ముందు ముగ్గురు స్టార్ ప్లేయర్లకు గాయాలు
Team India T20 Squad

Updated on: Jan 14, 2026 | 11:51 AM

Team India : వరల్డ్ కప్ గెలవాలనే పట్టుదలతో ఉన్న భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. టోర్నీ మొదలవ్వడానికి ఇంకా కొద్దిరోజులే సమయం ఉండగా, ముగ్గురు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇది జట్టు కూర్పును దెబ్బతీయడమే కాకుండా, సెలక్టర్లకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ గాయపడిన వారి జాబితాలో చేరారు. వీరిలో తిలక్ వర్మ పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. అందరినీ ఆందోళనకు గురిచేస్తున్న విషయం ఏమిటంటే.. యువ సంచలనం తిలక్ వర్మకు సర్జరీ జరగడం. విజయ్ హజారే ట్రోఫీ ఆడుతుండగా తిలక్ తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. పరీక్షించిన డాక్టర్లు అబ్డామినల్ గాయాన్ని గుర్తించి వెంటనే సర్జరీ చేయాలని సూచించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నప్పటికీ, ఫిజికల్ ట్రైనింగ్ మొదలుపెట్టడానికి ఇంకా సమయం పడుతుంది. వరల్డ్ కప్ ప్రారంభానికి చాలా తక్కువ టైమ్ ఉండటంతో, తిలక్ తుది జట్టులో ఉంటాడా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అతని గైర్హాజరీ మిడిల్ ఆర్డర్‌లో పెద్ద లోటుగా మారే అవకాశం ఉంది.

మరోవైపు ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా గాయపడ్డాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ సమయంలో అతనికి ఎడమవైపు పక్కటెముకలకు గాయం కావడంతో జట్టుకు దూరమయ్యాడు. స్పిన్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించే సుందర్ జట్టుకు చాలా ముఖ్యం. ఇక రిషబ్ పంత్ విషయానికొస్తే, అతను చీలమండ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. అయితే పంత్ ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ ప్రణాళికల్లో లేకపోయినా, కీలక ఆటగాళ్లు వరుసగా గాయపడటం టీమ్ మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది.

సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత్ తన ప్రాబబిలిటీ జట్టును ఇప్పటికే ప్రకటించింది. అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా ఉండగా.. అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, జస్ప్రీత్ బుమ్రా వంటి హేమాహేమీలు జట్టులో ఉన్నారు. కానీ తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ వంటి వారు జట్టు సమతూకానికి చాలా అవసరం. ఒకవేళ వీరు కోలుకోకపోతే, చివరి నిమిషంలో రింకూ సింగ్ లేదా ఇతర ఆటగాళ్లకు కీలక బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. మరి మన స్టార్లు కోలుకుని మైదానంలోకి ఎప్పుడు దిగుతారో చూడాలి.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..