కొంపముంచిన ఐపీఎల్.. డుప్లెసిస్ నిర్వేదం!

|

Jun 24, 2019 | 12:14 PM

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం లార్డ్స్ మైదానంలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సఫారీలు 49 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌తో దక్షిణాఫ్రికా వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించింది. ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో సఫారీల కెప్టెన్ డుప్లెసిస్ తమ జట్టు వైఫల్యంపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్‌కప్ ముందు జరిగిన ఐపీఎల్ తమ కొంప ముంచిందని డుప్లెసిస్ పేర్కొన్నాడు. మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్న ఆటగాళ్లను బోర్డు […]

కొంపముంచిన ఐపీఎల్.. డుప్లెసిస్ నిర్వేదం!
డుప్లెసిస్
Follow us on

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం లార్డ్స్ మైదానంలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సఫారీలు 49 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌తో దక్షిణాఫ్రికా వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించింది. ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో సఫారీల కెప్టెన్ డుప్లెసిస్ తమ జట్టు వైఫల్యంపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

వరల్డ్‌కప్ ముందు జరిగిన ఐపీఎల్ తమ కొంప ముంచిందని డుప్లెసిస్ పేర్కొన్నాడు. మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్న ఆటగాళ్లను బోర్డు ఐపీఎల్‌కు అనుమతించకుండా ఉండాల్సిందని అతడు అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌లో ఆడటం వల్లే తమ ఆటగాళ్లకు విశ్రాంతి దొరకలేదని.. ఈ ప్రభావం ప్రపంచకప్‌పై పడిందని వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ కగిసో రబడా వైఫ్యలం జట్టు విజయాలపై తీవ్ర ప్రభావం చూపించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. లీగ్ దశలోనే తాము వెనుదిరగడం చాలా బాధగా ఉందని డుప్లెసిస్ స్పష్టం చేశాడు.