Travis Head : బాదుడే.. బాదుడు.. 69 బంతుల్లోనే సెంచరీ..123 ఏళ్ల రికార్డు బ్రేక్..యాషెస్ చరిత్రలో ఇది రెండో సారి

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ సిరీస్ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ అద్భుతమైన, విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. పెర్త్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో హెడ్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్ గెలవడానికి 205 పరుగుల టార్గెట్ లభించగా, దాన్ని హెడ్ సిక్సర్లు, ఫోర్లతో చెదరగొట్టాడు.

Travis Head : బాదుడే.. బాదుడు.. 69 బంతుల్లోనే సెంచరీ..123 ఏళ్ల రికార్డు బ్రేక్..యాషెస్ చరిత్రలో ఇది రెండో సారి
Travis Head

Updated on: Nov 22, 2025 | 4:37 PM

Travis Head : ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ సిరీస్ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ అద్భుతమైన, విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. పెర్త్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో హెడ్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్ గెలవడానికి 205 పరుగుల టార్గెట్ లభించగా, దాన్ని హెడ్ సిక్సర్లు, ఫోర్లతో చెదరగొట్టాడు. ఈ ధాటితో హెడ్ ఏకంగా 123 సంవత్సరాల పాత రికార్డును బద్దలు కొట్టాడు.

రికార్డు బద్దలు కొట్టిన ట్రావిస్ హెడ్

ట్రావిస్ హెడ్ ఈ టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసి కేవలం 21 పరుగులే చేశాడు. కానీ, చివరి ఇన్నింగ్స్‌లో ఓపెనింగ్ చేసే అవకాశం రావడంతో, దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. హెడ్ మొదటి నుంచే వేగంగా పరుగులు చేశాడు, పెర్త్ పిచ్‌పై కష్టంగా కనిపించిన 205 పరుగుల టార్గెట్‌ను సులభతరం చేశాడు. కేవలం 36 బంతుల్లోనే హెడ్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఇది యాషెస్ చరిత్రలో మూడవ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డ్. ఆ తర్వాత కూడా హెడ్ ఆగకుండా కేవలం 69 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేశాడు. ఈ వేగంతో ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన వారి జాబితాలో హెడ్ సంయుక్తంగా మూడో స్థానానికి చేరుకున్నాడు. అలాగే, టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఇది ఐదవ వేగవంతమైన సెంచరీ రికార్డు.

123 ఏళ్ల రికార్డు బ్రేక్

ట్రావిస్ హెడ్ చేసిన ఈ సెంచరీ యాషెస్ సిరీస్ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. యాషెస్ సిరీస్ చరిత్రలో ఇది రెండవ అత్యంత వేగవంతమైన సెంచరీ. హెడ్ తన 69 బంతుల సెంచరీతో గిల్‌బర్ట్ జెస్సోప్ రికార్డును బద్దలు కొట్టాడు. జెస్సోప్ 1902లో ఆస్ట్రేలియాపై 76 బంతుల్లో సెంచరీ కొట్టాడు. యాషెస్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు మాత్రం ఆడం గిల్‌క్రిస్ట్ పేరిట ఉంది. అతను 2006-07 యాషెస్‌లో కేవలం 57 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..