IPL 2025: ఈ ఐపీఎల్ లో SRH మాన్‌స్టర్ ట్రావిస్ హెడ్ క్రియోట్ చేయబోయే రికార్డ్స్ ఇవే..

|

Mar 30, 2025 | 11:59 AM

ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్ ఐపీఎల్ 2025లో అదిరిపోయే బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను తీవ్ర ఒత్తిడిలోకి నెడుతున్నాడు. 1000 ఐపీఎల్ పరుగుల మార్క్‌కు 114 పరుగుల దూరంలో ఉన్న అతను, 50 సిక్సుల మైలురాయిని చేరుకోవడానికి కేవలం 4 సిక్సుల అవసరం. అదేవిధంగా, భారతదేశంలో జరిగిన టి20 మ్యాచ్‌లలో 50 సిక్సులు పూర్తి చేయడానికి ఒక్క భారీ షాట్‌ మిగిలింది. ప్రస్తుతం 194 టీ20 సిక్సులతో ఉన్న హెడ్, 200 సిక్సుల క్లబ్‌లో చేరేందుకు మరో 6 సిక్సులు మాత్రమే అవసరం, రాబోయే మ్యాచ్‌ల్లో ఈ రికార్డులను సాధించనున్నాడు!

IPL 2025: ఈ ఐపీఎల్ లో SRH మాన్‌స్టర్ ట్రావిస్ హెడ్ క్రియోట్ చేయబోయే రికార్డ్స్ ఇవే..
Travis Head Ipl
Follow us on

ఆస్ట్రేలియా పవర్ హిట్టర్ ట్రావిస్ హెడ్ తన అద్భుత బ్యాటింగ్‌తో ఐపీఎల్ ఫ్రాంచైజీలకు తలనొప్పిగా మారాడు. ఐపీఎల్ 2025లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. పవర్‌ప్లేలో అతని దూకుడు, బౌండరీల వర్షం, భారీ సిక్సులు – వీటన్నింటితో కలిసి అతను ఆరంభంలోనే జట్టుకు మెరుగైన స్థితిని అందించేందుకు కృషి చేస్తున్నాడు. ట్రావిస్ హెడ్ ఓపెనర్‌గా వచ్చి బౌండరీల వర్షం కురిపించడం, భారీ సిక్సులతో బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టడం.. ఇవన్నీ అతని ఆటలో భాగం. అతని పవర్‌ప్లే స్ట్రైక్ రేట్ అత్యధికంగా ఉండడం జట్టుకు వేగంగా పరుగులు అందించడంలో సహాయపడుతోంది. ఐపీఎల్ 2025లో ముందున్న మ్యాచ్‌లలో అతను కొన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. అవేంటో చూద్దాం!

1. 1000 ఐపీఎల్ పరుగులకు 114 పరుగుల దూరంలో

ట్రావిస్ హెడ్ ఐపీఎల్‌లో 1000 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి కేవలం 114 పరుగుల దూరంలో ఉన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అతను కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ వచ్చాడు. రాబోయే కొన్ని మ్యాచ్‌ల్లో అతను భారీ స్కోరు సాధిస్తే ఈ ఘనతను సాధించే వీలుంది.

2. 50 ఐపీఎల్ సిక్సర్లకు 4 సిక్సుల దూరంలో

హెడ్ ఐపీఎల్‌లో 50 సిక్సులు పూర్తి చేయడానికి కేవలం 4 సిక్సుల దూరంలో ఉన్నాడు. తన క్లీన్హిట్టింగ్ వల్ల ప్రత్యర్థి బౌలింగ్‌ను గజగజలాడించే సామర్థ్యం అతనికి ఉంది. ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో వచ్చే మ్యాచ్‌లో అతను ఈ రికార్డును చేరుకునే అవకాశం ఎక్కువ.

3. 100 ఐపీఎల్ ఫోర్లకు 10 ఫోర్ల దూరంలో

ట్రావిస్ హెడ్ ఐపీఎల్ చరిత్రలో 100 ఫోర్లు పూర్తిచేయడానికి 10 బౌండరీలు మాత్రమే అవసరం. పవర్‌ప్లేలో దూకుడైన ఆటతీరుతో ప్రత్యర్థి బౌలర్లను అతడు చెదరగొట్టడం తెలిసిందే. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై జరిగే మ్యాచ్‌లోనే అతను ఈ మైలురాయిని చేరుకోవచ్చు.

4. భారతదేశంలో (T20s) 50 సిక్సులకు 1 సిక్స్ దూరంలో

హెడ్ భారతదేశంలో జరిగిన టి20 మ్యాచ్‌లలో 50 సిక్సులు పూర్తి చేయడానికి కేవలం 1 సిక్స్ దూరంలో ఉన్నాడు. భారత పిచ్‌లపై అతనికి మంచి అనుభవం ఉంది. స్పిన్నర్లనూ, పేసర్లనూ ఎదుర్కొనేలా తన బ్యాటింగ్‌ను తీర్చిదిద్దుకున్నాడు. కాబట్టి రాబోయే మ్యాచ్‌లో ఒక భారీ షాట్‌తో ఈ రికార్డును తన ఖాతాలో వేసుకోవచ్చు.

5. టీ20 కెరీర్‌లో 200 సిక్సులకు 6 సిక్సుల దూరంలో

ట్రావిస్ హెడ్ తన మొత్తం టీ20 కెరీర్‌లో 200 సిక్సులు పూర్తి చేయడానికి కేవలం 6 సిక్సుల దూరంలో ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా వివిధ లీగ్‌లలో అతని ధాటిగా బ్యాటింగ్‌తో ఈ సంఖ్య పెరిగింది. ప్రస్తుతం అతని పేరిట 194 సిక్సులు ఉన్నాయి, 149.44 స్ట్రైక్ రేట్‌తో కొనసాగుతున్నాడు. తక్కువ బంతుల్లోనే భారీ షాట్లు కొట్టే మెంటాలిటీ ఉండటంతో, అతను ఈ రికార్డును వచ్చే మ్యాచ్‌లోనే సాధించే అవకాశముంది. ఇంకా ఎన్ని రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి!