
IND vs NZ 3rd ODI : ఇండోర్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. కివీస్ నిర్దేశించిన 338 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత టాప్ ఆర్డర్ కుప్పకూలింది. కేవలం 71 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి భారత్ డిఫెన్స్‌లో పడింది. ప్రస్తుతం క్రీజులో ఉన్న కింగ్ కోహ్లీపైనే భారత్ ఆశలన్నీ నిలిచి ఉన్నాయి. భారీ లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆశించిన ఆరంభం లభించలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ (11) మరోసారి విఫలమయ్యాడు. నాలుగో ఓవర్లోనే అతనికి లైఫ్ లభించినా, దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఇన్-ఫామ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (23) కూడా కైల్ జామీసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. గిల్ వెనుదిరగడంతో భారత్ 45 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
మధ్యలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ (3) కూడా నిరాశపరిచాడు. క్రిస్ క్లార్క్ వేసిన షార్ట్ పిచ్ బంతిని పుల్ చేయబోయి మిడ్-ఆన్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అప్పటికే భారత్ కష్టాల్లో ఉండగా, మరో వికెట్ పడటంతో స్కోరు 71/4 కు చేరుకుంది. టాప్ ఆర్డర్ అంతా పెవిలియన్ కు క్యూ కట్టడంతో స్టేడియంలోని అభిమానులు నిశ్శబ్దంగా ఉండిపోయారు. కివీస్ బౌలర్లు ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేస్తూ భారత బ్యాటర్లను ఊపిరి తీసుకోనీయడం లేదు.
No fifty in this ODI series for Rohit Sharma. A series to forget for him. Now we’ll see him in the Indian jersey only after 5–6 months. pic.twitter.com/gIXN6zAGvA
— R A T N I S H (@LoyalSachinFan) January 18, 2026
ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఇప్పుడు అందరి కళ్లు విరాట్ కోహ్లీపైనే ఉన్నాయి. భారత్ గెలవాలంటే కోహ్లీ మరోసారి తన ఛేజ్ మాస్టర్ ట్యాగ్‌ను నిరూపించుకోవాలి. అతనికి తోడుగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఎంతవరకు సహకరిస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్నా, వికెట్లు వరుసగా పడటం టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టింది. ఒకవేళ కోహ్లీ నిలబడితేనే భారత్ ఈ భారీ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమవుతుంది.