15 బంతుల్లో బీభత్సం.. 6 సిక్సులు, 2 ఫోర్లతో హాఫ్ సెంచరీ.. అక్కడ అదరగొడుతోన్న ముంబై ఇండియన్స్ ప్లేయర్..

|

Jul 01, 2022 | 6:21 PM

TNPL సీజన్‌లోని మొదటి మ్యాచ్‌లో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ తన తుఫాన్ బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 47 బంతుల్లో..

15 బంతుల్లో బీభత్సం.. 6 సిక్సులు, 2 ఫోర్లతో హాఫ్ సెంచరీ.. అక్కడ అదరగొడుతోన్న ముంబై ఇండియన్స్ ప్లేయర్..
Tnpl Sanjay Yadav Smashes Fifty
Follow us on

భారత క్రికెట్ జట్టు(Indian Cricket Team) ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇరుజట్ల మధ్య జులై 1 శుక్రవారం నుంచి ఐదో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. భారత అభిమానులందరి కళ్లు ఈ టెస్టుపైనే నిలిచాయి. అయితే, అందరి దృష్టి భారత్‌ ఇంగ్లండ్‌ పర్యటనపైనే కేంద్రీకృతమైనప్పటికీ.. సొంతగడ్డపై కూడా ఓ ప్రత్యేక టోర్నీ జరుగుతుంది. ఇందులో భారత ఆటగాళ్లు తమ సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో ఓ భారత ఆటగాడు తన బ్యాట్‌తో బౌలర్లపై దాడి చేసి హాఫ్ సెంచరీ బాదేశాడు. ఈ ఆటగాడి పేరు సంజయ్ యాదవ్(Sanjay Yadav). తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL)లో ఈ ప్లేయర్ అద్భుతంగా ఆడుతూ, చర్చల్లో నిలిచాడు.

టీఎన్‌పీఎల్ ఏడవ మ్యాచ్‌లో భాగంగా నెల్లై రాయల్ కింగ్స్ వర్సెస్ దిండిగల్ డ్రాగన్స్ టీంలు శుక్రవారం, జులై 1న దిండిగల్‌లో తలపడ్డాయి. వర్షం కారణంగా, ఈ మ్యాచ్ 12 ఓవర్లకు కుదించారు. ఈ చిన్న మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్స్ ఆకట్టుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య దిండిగల్ 5 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. జట్టులో ఓపెనర్లు ఇద్దరూ విశాల్ వైద్య 45 పరుగులు (21 బంతులు), హరి నిశాంత్ 37 పరుగులు (27 బంతులు) చేశారు. మిస్టర్ నిరంజన్ 32 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, సంజయ్ యాదవ్ కూడా ఒక వికెట్ తీశాడు.

సంజయ్, అపరాజితల తుఫాన్ ఇన్నింగ్స్..

ఇవి కూడా చదవండి

నెల్లై ఇన్నింగ్స్‌లో తొలి 5 ఓవర్లలో 34 పరుగులకు ఓపెనర్లిద్దరి వికెట్లు పడ్డాయి. ఆపై బాబా అపరాజిత్ మూడో స్థానంలో నిలవగా, నాలుగో స్థానంలో వచ్చిన సంజయ్ యాదవ్ కేవలం 11 ఓవర్లలో అజేయంగా 99 పరుగుల భాగస్వామ్యంతో మ్యాచ్‌ను గెలుచుకున్నారు. అపరాజిత్ కేవలం 30 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు.

ఈ క్రమంలో 27 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ సంజయ్ కేవలం 19 బంతుల్లో 55 పరుగులు చేసి బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 15 బంతుల్లోనే సంజయ్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఏకంగా 9వ ఓవర్లో వరుసగా 4 సిక్సర్లు బాదేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి.

ఒకే ఒక్క అవకాశమే ఇచ్చిన ముంబై ఇండియన్స్..

సంజయ్ యాదవ్ తుఫాన్ ఇన్నింగ్స్‌లకు పేరుగాంచాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో తమిళనాడు తరపున దేశవాళీ క్రికెట్‌లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతను TNPLలో కూడా దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో అతను కేవలం 47 బంతుల్లో 87 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే IPL 2022కి ముందు అతన్ని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. కానీ, మొత్తం సీజన్‌లో అతనికి ఒకే ఒక్క అవకాశం ఇచ్చారు. అందులో అతను సత్తా చాటలేకపోయాడు.