IPL 2023: 6 మ్యాచ్‌ల్లో 426 పరుగులు.. 5 అర్ధ సెంచరీలతో తమిళోడి ఊచకోత.. విండీస్‌తో టీ20లకు.?

|

Jun 26, 2023 | 1:00 PM

గుజరాత్ టైటాన్స్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఐపీఎల్ 2023 ఫైనల్‌తో మొదలుపెట్టిన అతడు..

IPL 2023: 6 మ్యాచ్‌ల్లో 426 పరుగులు.. 5 అర్ధ సెంచరీలతో తమిళోడి ఊచకోత.. విండీస్‌తో టీ20లకు.?
Gujarat Titans
Follow us on

గుజరాత్ టైటాన్స్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఐపీఎల్ 2023 ఫైనల్‌తో మొదలుపెట్టిన అతడు.. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లోనూ అదే ఫామ్ కొనసాగిస్తున్నాడు. గత 6 ఇన్నింగ్స్‌లలో 5 అర్ధ సెంచరీలతో ఏకంగా 426 పరుగులు చేశాడు. 96, 86, 90, 64, 7 పరుగులు చేసిన సాయి.. ఆదివారం దిండిగుల్ డ్రాగన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 83 పరుగులు చేశాడు. అతడి ప్రదర్శనతో లైకా కోవై కింగ్స్ 59 పరుగుల తేడాతో దిండిగుల్‌ డ్రాగన్స్‌పై అద్భుత విజయం సాధించింది.

అంతకుముందు తిరుచ్చిపై 7 పరుగులు, చెపాక్ సూపర్ గిల్లీస్‌పై 64 నాటౌట్, నెల్లై రాయల్ కింగ్స్‌పై 90 పరుగులు, త్రిపుర తమిజన్స్‌పై 86 పరుగులు చేశాడు సుదర్శన్. ఇక ఐపీఎల్ 2023‌లో సుదర్శన్ 8 మ్యాచ్‌లలో 51.71 సగటుతో 362 పరుగులు చేశాడు. అతడు చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్‌లో 96 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. కాగా, సుదర్శన్ సుడిగాలి ఇన్నింగ్స్‌లు చూసి.. నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. విండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు సుదర్శన్‌ను ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కన్సిస్టెన్సీ, భారీ షాట్స్ ఆడగల సామర్ధ్యం, ప్లేయింగ్ స్టైల్‌లో సుదర్శన్‌.. యశస్వి, రుతురాజ్‌కు ఏమాత్రం తీసిపోడని అంటున్నారు.