Tilak Varma : రియాన్ పరాగ్‎కు ఛాన్స్ ఇస్తారా? లేక శ్రేయస్ అయ్యర్‎నే మొగ్గు చూపుతారా? తిలక్ వర్మ ప్లేస్‎లో ఎవరు ?

Tilak Varma : టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ గాయం కారణంగా న్యూజిలాండ్‌తో జరగబోయే మొదటి మూడు టీ20లకు దూరమయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్న సమయంలో అతనికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో రాజ్‌కోట్‌లో అత్యవసరంగా సర్జరీ చేశారు.

Tilak Varma : రియాన్ పరాగ్‎కు ఛాన్స్ ఇస్తారా? లేక శ్రేయస్ అయ్యర్‎నే మొగ్గు చూపుతారా? తిలక్ వర్మ ప్లేస్‎లో ఎవరు ?
Tilak Varma

Updated on: Jan 09, 2026 | 5:57 PM

Tilak Varma : టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ గాయం కారణంగా న్యూజిలాండ్‌తో జరగబోయే మొదటి మూడు టీ20లకు దూరమయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్న సమయంలో అతనికి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో రాజ్‌కోట్‌లో అత్యవసరంగా సర్జరీ చేశారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నప్పటికీ, మైదానంలోకి రావడానికి కనీసం రెండు వారాల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో తిలక్ వర్మ స్థానంలో ఎవరిని తీసుకోవాలనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బీసీసీఐ అధికారిక సమాచారం ప్రకారం.. బుధవారం జనవరి 7న తిలక్ వర్మకు పొత్తికడుపులో వచ్చిన సమస్య కారణంగా సర్జరీ జరిగింది. గురువారం ఉదయం అతను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం విశ్రాంతి కోసం హైదరాబాద్ వస్తున్న తిలక్, గాయం పూర్తిగా మానిన తర్వాతే మళ్ళీ ట్రైనింగ్ మొదలుపెడతాడు. దీనివల్ల న్యూజిలాండ్‌తో జరిగే మొదటి మూడు టీ20లకు అతను అందుబాటులో ఉండడు. మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఆడతాడా లేదా అనేది అతని రికవరీని బట్టి బోర్డు నిర్ణయిస్తుంది.

తిలక్ వర్మ స్థానంలో శుభ్‌మన్ గిల్ లేదా యశస్వి జైస్వాల్‌ను తీసుకోవాలని చాలా మంది అంటున్నప్పటికీ, ఆకాష్ చోప్రా మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. దానికి ఆయన ఒక లాజిక్ చెప్పారు. “మీకు కావాల్సింది ఓపెనర్ కాదు, ఎందుకంటే తిలక్ వర్మ 3 లేదా 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. కాబట్టి మిడిల్ ఆర్డర్‌లో ఆడే ప్లేయర్ కావాలి. గిల్, జైస్వాల్ ఇద్దరూ ఓపెనర్లు, కాబట్టి వారిని రిప్లేస్‌మెంట్ గా చూడలేం” అని ఆకాష్ వివరించారు.

తిలక్ వర్మ స్థానంలో ఆకాష్ చోప్రా ముగ్గురి పేర్లను సూచించారు. అందులో మొదటిది శ్రేయస్ అయ్యర్ (సర్పంచ్ సాబ్). ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో అయ్యర్ మంచి ఫామ్‌లో ఉన్నాడని, అతనికి అంతర్జాతీయ అనుభవం కూడా తోడవుతుందని ఆకాష్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ అయ్యర్ కాకపోతే రెండో ఆప్షన్ గా రియాన్ పరాగ్ పేరు చెప్పారు. పరాగ్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా ఉపయోగపడతాడు. ఇక మూడో ఆప్షన్ గా ఫినిషర్ రోల్ కోసం జితేష్ శర్మ పేరును ఆయన ప్రస్తావించారు.

న్యూజిలాండ్ లాంటి బలమైన జట్టుపై పోరాడాలంటే మిడిల్ ఆర్డర్ బలంగా ఉండాలి. తిలక్ వర్మ దూరం అవ్వడం టీమ్ ఇండియాకు లోటే అయినప్పటికీ, శ్రేయస్ అయ్యర్ లాంటి సీనియర్ ప్లేయర్ జట్టులోకి వస్తే అది అదనపు బలం అవుతుంది. సెలెక్టర్లు ఆకాష్ చోప్రా సూచనలను పాటిస్తారా లేదా అనేది చూడాలి. తిలక్ వర్మ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..