Watch Video : ముంబైలో తిలక్ వర్మ సందడి.. అమృతా ఫడ్నవీస్‌తో భేటీకి కారణం అదేనా ?

Watch Video : జింబాబ్వే పర్యటన ముగించుకుని ముంబై చేరుకున్న టీమిండియా యువ స్టార్ తిలక్ వర్మ, అమృతా ఫడ్నవీస్‌ను ప్రత్యేక కార్యక్రమంలో కలిశారు. ఇద్దరూ సరదాగా ముచ్చటించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబై ఇండియన్స్ భవిష్యత్ కెప్టెన్‌గా తిలక్ వర్మపై జరుగుతున్న ప్రచారం కూడా ఆసక్తి రేపుతోంది.

Watch Video : ముంబైలో తిలక్ వర్మ సందడి.. అమృతా ఫడ్నవీస్‌తో భేటీకి కారణం అదేనా ?
Tilak Varma

Updated on: Aug 06, 2026 | 4:19 PM

Watch Video : భారత నయా క్రికెట్ సంచలనం తిలక్ వర్మ ఇటీవల జింబాబ్వే పర్యటనను విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ పర్యటనలో భారత జట్టు 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న తిలక్ వర్మ, టెస్టు జట్టులో సభ్యుడు కాకపోవడంతో ఆయనకు కొన్ని రోజుల విశ్రాంతి లభించింది. ఈ బ్రేక్ సమయంలో ఆయన ముంబైలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృతా ఫడ్నవీస్‌తో ఆయన భేటీ అయ్యారు.

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వైరల్ వీడియో

ముంబైలో జరిగిన ఒక ఈవెంట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తిలక్ వర్మ, అమృతా ఫడ్నవీస్ పక్కపక్క టేబుళ్లపై కూర్చుని కనిపించారు. పక్కనే ఉన్న అమృతను గమనించిన తిలక్ వర్మ వెంటనే ఆమెను పలకరించి, మాట్లాడేందుకు వీలుగా తన కుర్చీని కాస్త ముందుకు జరుపుకున్నారు. వీరిద్దరూ చాలా సేపు నవ్వుతూ పలు అంశాలపై ముచ్చటించారు. ఈ దృశ్యాలు కెమెరాకు చిక్కడంతో అభిమానులు నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు.

క్రీడలపై అమృతా ఫడ్నవీస్ ఆసక్తి

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వార్తల్లో నిలుస్తుంటారు. 47 ఏళ్ల వయసులోనూ ఆమె తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. క్రీడల పట్ల ఆమెకు ఎంతో ఆసక్తి ఉంది. గతంలో ప్రముఖ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ముంబై పర్యటనకు వచ్చిన సమయంలో కూడా అమృతా ఫడ్నవీస్ ఆయనను ప్రత్యేకంగా కలిశారు. ఇప్పుడు టీమిండియా యంగ్ స్టార్ తిలక్ వర్మను కలిసి క్రీడల గురించి మాట్లాడటం విశేషం.

ముంబై ఇండియన్స్ భవిష్యత్ కెప్టెన్ తిలక్ వర్మ?

హైదరాబాద్‌కు చెందిన తిలక్ వర్మ ఐపిఎల్‎లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నందున ముంబై నగరం ఆయనకు రెండో ఇల్లు లాంటిది. 2022లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నారు. ఒకవేళ భవిష్యత్తులో హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టు నుంచి వేరైతే, ఫ్రాంచైజీ కెప్టెన్సీ బాధ్యతలను తిలక్ వర్మకే అప్పగించే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతోంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us