2025 ఆసియా లెజెండ్స్ లీగ్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో శ్రీలంక మాజీ క్రికెటర్ తిసారా పెరీరా తన అద్భుత బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమానులను ఆకర్షించాడు. శనివారం ఉదయపూర్‌లో శ్రీలంక లయన్స్-ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో తిసారా పెరీరా కేవలం 36 బంతుల్లో 108 పరుగులు సాధించాడు. ముఖ్యంగా, 20వ ఓవర్‌లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ అయాన్ ఖాన్ బౌలింగ్‌లో అతను వరుసగా ఆరు సిక్సర్లు బాదాడు. తిసారా పెరీరా ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదడం ఇదే మొదటిసారి కాదు. 2021లో శ్రీలంక క్రికెట్ మేజర్ క్లబ్స్ టోర్నమెంట్‌లో, బ్లూమ్‌ఫీల్డ్ క్రికెట్, అథ్లెటిక్ క్లబ్‌పై ఆర్మీ స్పోర్ట్స్ క్రికెట్ క్లబ్ తరఫున అతను ఇదే విధంగా ఆరు సిక్సర్లు కొట్టాడు. ఈ ఘనత ఆయనకు మళ్లీ 2025 ఆసియా లెజెండ్స్ లీగ్‌లో లభించింది.
ఈ మ్యాచ్‌లో, తిసారా పెరీరా తన ఇన్నింగ్స్‌లో 13 సిక్సర్లు, రెండు ఫోర్లు కొట్టి శ్రీలంక జట్టును మెరుగైన స్థితిలో నిలిపాడు. అతని అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో, శ్రీలంక లయన్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 230 పరుగుల భారీ స్కోరు సాధించింది. అతనికి తోడుగా మెవాన్ ఫెర్నాండో కూడా అర్ధశతకం సాధించి జట్టుకు మంచి సహకారం అందించాడు.
ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో తిసారా పెరీరా మాత్రమే కాదు. భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్, వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు కీరన్ పొలార్డ్, భారత మాజీ ఆటగాడు రవిశాస్త్రి కూడా ఈ ఘనత సాధించారు. తిసారా పెరీరా 2009లో భారత్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో శ్రీలంక తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో అతను 14 బంతుల్లో 31 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే, శ్రీలంక జట్టు ఆ మ్యాచ్‌లో ఓడిపోయింది.
తన అంతర్జాతీయ కెరీర్‌లో అతను మొత్తం 6 టెస్టులు, 186 వన్డేలు, 84 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం మూడు ఫార్మాట్లలో కలిపి 3148 పరుగులు చేయడంతో పాటు, 237 వికెట్లు కూడా తీసుకున్నాడు. మే 2021లో అతను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
Skipper on duty 🤩
Thisara Perera's blistering 108* off 36 balls helped Sri Lankan Lions to put 230 on board 🔥#MPMSCAsianLegendsLeague pic.twitter.com/cE3Zw9rQJq
— FanCode (@FanCode) March 15, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..