Ambati Rayudu: హెచ్‌సీఏ ఫోర్త్ స్టేజ్‌ క్యాన్సర్‌లో ఉందని రాయుడు ఎందుకన్నారు.. ?

|

Jun 14, 2023 | 9:47 PM

క్రికెటర్‌ అంబటి రాయుడిని తెలిసిన వాళ్లే..తెలుగు వాళ్లే అడ్డుకుంటున్నారా..రాయుడు ఎందుకలా చెప్పారు. మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌పై రాయుడు సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేసినా ఎందుకు ఎవరూ స్పందించడం లేదు. హెచ్‌సీఏ ఫోర్త్ స్టేజ్‌ క్యాన్సర్‌లో ఉందని రాయుడు ఎందుకన్నారు..

Ambati Rayudu: హెచ్‌సీఏ ఫోర్త్ స్టేజ్‌ క్యాన్సర్‌లో  ఉందని రాయుడు ఎందుకన్నారు.. ?
Ambati Rayudu
Follow us on

అంబటి రాయుడు..ఇండియా క్రికెట్‌లో మెరిసిన తెలుగు తేజం. రాయుడికి కోపం వచ్చిందా..మనసు నొచ్చుకునేలా ఎవరైనా ప్రవర్తించారా..ఎందుకంటే ఆయన కామెంట్స్‌ అలాగే ఉన్నాయి. టీవీ9 ఇంటర్వ్యూలో అంబటి రాయుడు ఎమోషనల్‌ అయ్యారు. తనను తెలుగువాళ్లే అడ్డుకున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌పైనా రాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయినా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి నుంచి రెస్పాన్స్ రాలేదు.

అంబటి రాయుడు ఆరోపణలపై క్రికెట్‌ పెద్దలు ఎందుకు మౌనం దాల్చారు. అంటే రాయుడు చెప్పిందే నిజమా..ఇప్పుడు నోరు విప్పితే అసలుకే మోసమొస్తుందని ఎవరికి వారు తేలుకుట్టిన దొంగల్లా కిమ్మనకుండా ఉన్నారా.. అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌నీ రాయుడు వదల్లేదు. హెచ్‌సీఏ ఫోర్త్‌ స్టేజ్‌ క్యాన్సర్‌తో ఉందని సంచలన కామెంట్స్‌ చేశారు. రాయుడు వ్యాఖ్యలపై అటు ఎమ్మెస్కే కానీ..ఇటు శివలాల్‌ యాదవ్‌ కానీ నోరు మెదపలేదు. ప్రస్తుతం హెచ్‌సీఎ ఎన్నికలు ఉండటంతోనే సైలెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అంబటి రాయుడిపై స్పందించి..అతడిని పెద్దవాడిని చేయదల్చుకోలేదంటూ శివలాల్‌ అనుచరులు చెప్పారు. ఏదేమైనా..రాయుడు మాత్రం బాగా హర్ట్‌ అయ్యారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..