Goutham Gambir: గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, ఇషాంత్ శర్మతో ఎలాంటి వివాదం లేదు.. పాక్ మాజీ వికెట్ కీపర్..

భారత మాజీ ఆటగాడికి తనకు ఎలాంటి శత్రుత్వం లేదని పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ చెప్పాడు. ఇంతకీ ఎవరా ఇద్దరు మాజీ ఆటగాళ్లు అంటే..

Goutham Gambir: గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, ఇషాంత్ శర్మతో ఎలాంటి వివాదం లేదు.. పాక్ మాజీ వికెట్ కీపర్..
Gambir

Updated on: Jan 30, 2022 | 6:47 PM

భారత మాజీ ఆటగాడికి తనకు ఎలాంటి శత్రుత్వం లేదని పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ చెప్పాడు. ఇంతకీ ఎవరా ఇద్దరు మాజీ ఆటగాళ్లు అంటే వారే గౌతమ్ గంభీర్(goutham gambir), కమ్రాన్ అక్మల్(kamran akmal). 2010 ఆసియా కప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ మ్యాచ్‌లో టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్‌ గంభీర్‌, పాక్‌ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్‌ అక్మల్‌ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇప్పుడు ఇదేందుకు చెబుతున్నారంటే.. ఈ ఘటనపై పన్నెండేళ్ల తర్వాత కమ్రాన్‌ అక్మల్‌ స్పందించాడు. ప్రస్తుతం లెజెండ్స్ లీగ్‌ క్రికెట్ (LLC)లో అక్మల్‌ ఆడుతున్నాడు.

ఈ సందర్భంగా గంభీర్‌, హర్భజన్‌ సింగ్‌లో ఎవరితో శత్రుత్వం ఉందని వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు కమ్రాన్‌ అక్మల్‌ సమాధానం ఇస్తూ.. ‘‘నా వరకైతే వారిద్దరితో (గంభీర్, భజ్జీ) ఎలాంటి విరోధభావం లేదు. కేవలం అపార్థం చేసుకోవడం వల్లే గంభీర్‌తో ఆసియా కప్‌ సంఘటన జరిగింది. గౌతమ్‌ గంభీర్‌ ఎంతో మంచి వ్యక్తి. అలానే అత్యుత్తమ క్రికెటర్‌ కూడానూ. మేం ఇద్దరం కలిసి ఆసియా టీమ్‌కూ ఆడాం. కాబట్టి మా మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు’’ అని చెప్పాడు.

భారత పేస్‌ బౌలర్ ఇషాంత్ శర్మతో కూడా తనకు ఎలాంటి వివాదం లేదని కమ్రాన్‌ వివరించాడు. 2012-13 సీజన్‌లో బెంగళూరు వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌ సందర్భంగా ఇషాంత్‌, అక్మల్ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. పాకిస్తాన్ తరఫున కమ్రాన్‌ అక్మల్‌ 53 టెస్టుల్లో 2,648 పరుగులు, 157 వన్డేల్లో 3,236 పరుగులు చేశాడు. 58 టీ20ల్లో 987 పరుగులు సాధించాడు.

Read Also.. IPL-2022: మహారాష్ట్రలో లీగ్ మ్యాచ్‌లు.. అహ్మదాబాద్‌లో ప్లేఆఫ్ మ్యాచ్‌లు..