
ICC ODI World Cup 2023: ప్రపంచకప్ 2023కి సమయం దగ్గరపడుతోంది. అన్ని జట్లు ఈ మెగా టోర్నీకి సిద్ధమవుతున్నాయి. తమ బ్యాటింగ్ ఆర్డర్‌పై ఫోకస్ చేసి, ఓ లిస్ట్‌ను తయారుచేసుకుంటున్నాయి. అయితే, టీమ్ ఇండియా ముందు నంబర్ ఫోర్ సమస్య మాత్రం ఇంకా అలాగే ఉంది. శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ గాయాల కారణంగా భారత జట్టుకు కష్టాలు పెరిగాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ నంబర్‌లో ఎవరు ఆడతారు అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. అదే సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగో నంబర్‌లో బ్యాటింగ్ చేయగలడని షాకింగ్ న్యూస్ వస్తోంది. మీడియా కథనాల ప్రకారం, రోహిత్ శర్మ ఇకపై ఓపెనింగ్ చేయడు. అతన్ని నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు పంపుతారని తెలుస్తోంది.
నిజానికి కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ విషయంలో ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. వీరిద్దరూ ప్రపంచకప్ వరకు ఫిట్‌గా ఉంటారా లేదా అనే విషయంపై ఇంత వరకు ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో భారత జట్టు ముందు చాలా ఇబ్బందులు తలెత్తాయి. అదే సమయంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచురించిన వార్తల ప్రకారం, కెప్టెన్ రోహిత్ శర్మను నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు పంపవచ్చు. అంటే ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ ఓపెనర్స్ అవుతారని పేర్కొంది.
ఇక కేఎల్ రాహుల్ గురించి చెప్పాలంటే ఆగస్టు 18న అతడికి ఫిట్‌నెస్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత అతడిని ఆసియా కప్‌లో జట్టులోకి తీసుకోవాలా వద్దా అనేది సెలక్టర్లు నిర్ణయిస్తారు. ఆసియా కప్‌నకు భారత జట్టును ఇంకా ప్రకటించలేదు. మరోవైపు, శ్రేయాస్ అయ్యర్ గురించి మాట్లాడితే, అతను తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అతను చాలా కాలం పాటు నాలుగో నంబర్‌లో బ్యాటింగ్ చేశాడు. అయితే గాయం కారణంగా అతను గత కొన్ని నెలలుగా జట్టుకు దూరంగా ఉన్నాడు.
నివేదికల ప్రకారం, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఆసియా కప్‌లో ఆడలేకపోతే, వారు ప్రపంచ కప్‌నకు ఎంపిక కారు. ఇటువంటి పరిస్థితిలో సంజు శాంసన్‌ను నాల్గవ నంబర్‌లో, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలలో ఒకరిని ఐదవ స్థానంలో పంపవచ్చు అని తెలుస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..