భారత జట్టు దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ తల్లి షబ్నాన్ సింగ్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ విషయమై ఆమె హర్యానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం యువరాజ్ సింగ్ తల్లి షబ్నాన్ సింగ్ ఇల్లు హర్యానాలోని పంచకులలో ఉంది. ఈ ఇల్లే చోరీకి గురైంది. అయితే ఈ దొంగతనం జరిగి సుమారు ఆరు నెలలైంది. తాజాగా కేసు నమోదు అయ్యింది. పంచకులలోని సెక్టార్-4 ఎండీసీలో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇంట్లో 75 వేల రూపాయల నగదు, నగలు చోరీకి గురైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పని మనిషే ఈ చోరికి పాల్పడిందని యువీ తల్లి షబ్నమ్ ఆరోపించింది. ఎండీసీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెక్టార్-4 ఎండీసీకి చెందిన షబ్నమ్ సింగ్ ఇంటిని శుభ్రం చేసేందుకు సాకేత్డీకి చెందిన లలితాదేవిని, వంట చేసేందుకు బీహార్‌కు చెందిన సలీందర్ దాస్‌ను నియమించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అతని రెండవ ఇల్లు కూడా గురుగ్రామ్‌లో ఉంది. అతను తన రెండవ ఇంటిలో కొంతకాలం నివసిస్తున్నాడు. సెప్టెంబర్ 2023లో, ఆమె గురుగ్రామ్‌లోని తన ఇంటికి వెళ్లింది. అక్టోబర్ 5, 2023న, ఆమె తన MDC ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, కొన్ని ఆభరణాలు, దాదాపు రూ. 75 వేలు, మరికొన్ని వస్తువులు కనిపించలేదు.
‘నగదు, నగలను ఎవరో అపహరించారు. నా స్థాయిలో ఎన్నో ఎంక్వైరీలు చేసినా ఏమీ దొరకలేదు. లలితా దేవి, సలీందర్ దాస్ 2023లో దీపావళి నాటికి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు’ అని యూవీ తల్లి తెలిపారు. లలితా దేవి, సలీందర్ దాస్ నగలు, నగదు అల్మారా డ్రాయర్ల నుండి తాళాలు తీసుకున్నారని షబ్నమ్ అనుమానిస్తోంది. దొంగతనంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని MDC పోలీస్ స్టేషన్ SHO ధరంపాల్ సింగ్ తెలిపారు. మొత్తం రూ.1.75 లక్షల విలువైన సొత్తు చోరీకి గురైనట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
Wishing you a very happy birthday and loads of love Sagu ♥️ hope you have a lovely year ahead 🤗 @sagarikavghatge @hazelkeech pic.twitter.com/sUqB9zfE88
— Yuvraj Singh (@YUVSTRONG12) January 8, 2024
Wishing you a very Happy Birthday paaji! Here’s to another healthy year of swinging it with grace and style ⛳️ @therealkapildev pic.twitter.com/JVgMyKKUNC
— Yuvraj Singh (@YUVSTRONG12) January 6, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..