3గురు బ్యాటర్లు, 10 బంతుల్లో 16 పరుగులు.. కట్ చేస్తే.. లాస్ట్ బాల్‌లో మ్యాచ్ తిప్పేసిన బౌలర్.. ఎవరంటే.?

ది హండ్రెడ్ లీగ్‌లో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ చోటు చేసుకుంది. చివరి ముగ్గురు బ్యాట్స్‌మెన్లు.. 10 బంతుల్లో 16 పరుగులు చేయలేకపోయారు. దీనితో వేల్స్ ఫైర్ జట్టు వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆ వివరాలు..

3గురు బ్యాటర్లు, 10 బంతుల్లో 16 పరుగులు.. కట్ చేస్తే.. లాస్ట్ బాల్‌లో మ్యాచ్ తిప్పేసిన బౌలర్.. ఎవరంటే.?
Cricket

Updated on: Aug 21, 2025 | 10:59 AM

ది హండ్రెడ్ లీగ్‌లోని 21వ మ్యాచ్ ఇది. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో వేల్స్ ఫైర్ చివరి 10 బంతుల్లో 16 పరుగులు చేయాల్సి ఉండగా.. చేతిలో మూడు వికెట్లు మిగిలి ఉన్నాయ్. కట్ చేస్తే.. చివరికి ఒక్క బంతితో మ్యాచ్ మలుపు తిరిగింది. వేల్స్ ఫైర్ గెలవడానికి 1 బంతికి 6 పరుగులు అవసరమైనప్పుడు.. సదరన్ బ్రేవ్ బౌలర్ క్రిస్ జోర్డాన్ ఒక పరుగు మాత్రమే ఇచ్చి తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.

ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో సదరన్ బ్రేవ్ గెలుపు..

ఈ లీగ్‌లో 21వ మ్యాచ్ సదరన్ బ్రేవ్, వేల్స్ ఫైర్ మధ్య జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేవ్ 100 బంతుల్లో 8 వికెట్లకు 129 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్ హిల్టన్ కార్ట్‌రైట్ కేవలం 19 బంతుల్లో 5 సిక్సర్లు, 2 ఫోర్లతో అజేయంగా 51 పరుగులు చేశాడు. హిల్టన్‌తో పాటు కెప్టెన్ జేమ్స్ విన్స్ 26 బంతుల్లో 29 పరుగులు చేశాడు. వేల్స్ ఫైర్ తరపున డేవిడ్ పేన్, మాట్ హెన్రీ, క్రిస్ గ్రీన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌కు ముందు వేల్స్ ఫైర్ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడింటిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో గెలవడం వారికి చాలా ముఖ్యం. జట్టు ఓపెనర్లు స్టీవ్ స్మిత్, జానీ బెయిర్‌స్టో జట్టుకు మంచి ఆరంభం ఇచ్చి 12 బంతుల్లో 24 పరుగులు జోడించారు. కానీ బెయిర్‌స్టో (22) అవుట్ కాగానే జట్టు తడబడింది. వెనువెంటనే నాలుగు వికెట్లు కేవలం 50 పరుగులకే పడిపోయాయి. దీని తర్వాత టామ్ కోహ్లర్-కాడ్మోర్ (25), సైఫ్ జైబ్ (21) జట్టును ఆదుకోవాలని ట్రై చేయగా.. అది కుదరలేదు.

చివరి 10 బంతుల ఉత్కంఠ..

చివరి 10 బంతుల్లో వేల్స్ ఫైర్ జట్టుకు 16 పరుగులు అవసరం కాగా, ఇంకా మూడు వికెట్లు మిగిలి ఉన్నాయి. టామ్ కోహ్లర్-కాడ్మోర్‌పై జట్టు ఆశలన్నీ పెట్టుకుంది. కానీ జేమ్స్ కోల్స్ అతన్ని అవుట్ చేయగా.. వేల్స్ ఫైర్ ఆశలన్నీ దెబ్బతిన్నాయి. జట్టు 10 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి 4 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. వేల్స్ ఫైర్ జట్టు 100 బంతుల్లో 8 వికెట్లకు 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. సదరన్ బ్రేవ్ తరఫున ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు . క్రెయిగ్ ఓవర్టన్, జేమ్స్ కోల్స్ చెరో రెండేసి వికెట్లు పడగొట్టారు. వేల్స్ ఫైర్ తన నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగింట ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. సదరన్ బ్రేవ్ 6 మ్యాచ్‌ల్లో 3 గెలిచి పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో నిలిచింది.