IND vs NZ, ICC World Cup Semi Final: సెమీస్‌లో తలపడే 4 జట్లు ఇవే.. మ్యాచ్‌లు ఎప్పుడు, ఎక్కడ జరగనున్నాయంటే?

ICC ODI World Cup 2023 Semi Final Schedule: ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 సెమీ ఫైనల్‌లో ఏ జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయో దాదాపుగా స్పష్టమైంది. అసలు సెమీస్‌లో టీమిండియా ఎవరిని ఎదుర్కొంటుంది?, ఈ మ్యాచ్ ఎప్పుడు?, ఎక్కడ? జరుగనుందో పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. దీంతో కివీస్ సెమీఫైనల్ చేరడం 99 శాతం ఖాయమైంది. సెమీస్ రేసులో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ జట్టు పూర్తిగా తప్పుకున్నాయి.

IND vs NZ, ICC World Cup Semi Final: సెమీస్‌లో తలపడే 4 జట్లు ఇవే.. మ్యాచ్‌లు ఎప్పుడు, ఎక్కడ జరగనున్నాయంటే?
Ind Vs Nz Semi Final 2023

Updated on: Nov 10, 2023 | 4:25 PM

IND vs NZ, ICC World Cup Semi Final: 36 రోజులు, 41 మ్యాచ్‌ల తర్వాత, ఐసీసీ వన్డే ప్రపంచ కప్ సెమీ ఫైనల్ (ICC ODI World Cup SemiFinal) 2023 లో పోటీపడుతున్న నాలుగు జట్ల చిత్రం దాదాపుగా స్పష్టమైంది. ఆరంభం నుంచి ఎదురుచూసిన జట్లలో ఆతిథ్య భారత్ (Team India), ఆస్ట్రేలియా (Australia) జట్లు ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ (England) ఈసారి అర్హత సాధించడంలో విఫలమై అందరినీ ఆశ్చర్యపరిచింది. బదులుగా, దక్షిణాఫ్రికా (South Africa) మరోసారి ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. ఇది కూడా అందరూ ఊహించని జట్లు నాలుగో స్థానం కోసం పోటీ పడ్డాయి. నాలుగో జట్టు కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు పోటీ పడ్డాయి. అయితే, ఈ రేసు నుంచి ప్రస్తుతం పాకిస్తాన్, ఆఫ్గానిస్తాన్ తప్పుకున్నాయి.

బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో శ్రీలంకను సులువుగా ఓడించింది. దీంతో కివీస్ సెమీఫైనల్ చేరడం 99 శాతం ఖాయమైంది. సెమీస్ రేసులో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ జట్టు పూర్తిగా తప్పుకున్నాయి. కానీ, ఆఫ్ఘనిస్థాన్‌కు ఇది అసాధ్యం. దీని ప్రకారం, పాకిస్థాన్ కూడా సెమీఫైనల్‌కు చేరే అవకాశం చాలా తక్కువగా ఉంది.

సెమీ ఫైనల్స్‌లో 4 జట్లు ఇవే..

నవంబర్ 19న జరిగే ప్రపంచకప్ ఫైనల్‌లో ఏ జట్టు ఆడుతుందో భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు నిర్ణయిస్తాయి. ఇప్పుడు ఈ నాలుగు జట్ల చిత్రం క్లియర్‌గా ఉంది. ఏ జట్లు ఎప్పుడు, ఎక్కడ ఆడతాయో ఇప్పుడు చూద్దాం..

పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా మొదటి స్థానంలో కొనసాగుతుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది. ఇద్దరికీ తలో మ్యాచ్ ఉంది. స్టాండింగ్‌లలో స్థానం తదనుగుణంగా మారవచ్చు. న్యూజిలాండ్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. నిబంధనల ప్రకారం పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన జట్టు నాలుగో స్థానంలో నిలిచిన జట్టుతో తొలి సెమీస్‌లో, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు రెండో సెమీస్‌లో తలపడతాయి.

సెమీ-ఫైనల్ మ్యాచ్‌ల షెడ్యూల్..

న్యూజిలాండ్‌తో భారత్ తలపడడం దాదాపు ఖాయమైంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలు తలపడనున్నాయి. గత ప్రపంచకప్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ రిపీట్ కానుంది. 2019లో కూడా ఇరు జట్లు సెమీ ఫైనల్స్‌లో తలపడ్డాయి. ఈసారి కూడా భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. నవంబర్ 15న ముంబైలోని వాంఖడే స్టేడియం ఈ ఎన్‌కౌంటర్‌కు సాక్షిగా నిలుస్తుంది.

నవంబర్ 16న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే రెండు సెమీ ఫైనల్స్‌కు రిజర్వ్ డే ఉంచారు. తొలి సెమీఫైనల్‌లో గెలిచిన జట్టు, రెండో సెమీఫైనల్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌లో ప్రపంచకప్ టైటిల్ కోసం పోరాడుతాయి. ఈ మ్యాచ్ నవంబర్ 19న నిర్వహించనున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..