
Shameful Record: సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఎదురైన ఘోర పరాజయం టీమిండియా పరువును బజారున పడేసింది. ఈ ఓటమి తర్వాత సోషల్ మీడియాలో నెటిజన్లు భారత జట్టును ఒక ఆట ఆడుకుంటున్నారు. సెమీఫైనల్ వెళ్లడం ఇప్పుడు భారత్‌కు ఒక హిమాలయ పర్వతాన్ని ఎక్కినంత కష్టంగా మారింది. మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలవడంతో పాటు, పాతాళానికి పడిపోయిన రన్ రేట్‌ను కూడా సరిచేసుకోవాలి. అయితే ఈ దారుణ పరిస్థితులకు ప్రధాన కారణం మన ఓపెనర్లు అని గణాంకాలు చెబుతున్నాయి. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ జోడీ ఈ వరల్డ్ కప్‌లో భారత్‌కు అతిపెద్ద భారంగా మారింది.
ఈ టీ20 వరల్డ్ కప్ 2026లో పాల్గొన్న మొత్తం 20 జట్లలో టీమిండియా ఓపెనింగ్ జోడీనే అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. ఓపెనింగ్ భాగస్వామ్యంలో భారత్ సగటు కేవలం 6.8 పరుగులు మాత్రమే. మనకంటే చిన్న జట్లైన ఒమన్ (సగటు 10 పరుగులు), ఐర్లాండ్, యూఏఈ, అమెరికా జట్ల ఓపెనర్లు కూడా మనకంటే మెరుగ్గా రాణించడం సిగ్గుచేటు. ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు, అత్యుత్తమ బ్యాటర్లు ఉన్న జట్టుకు ఇలాంటి రికార్డు రావడం నిజంగానే అభిమానుల గుండెను రగిలిస్తోంది.
మరోవైపు న్యూజిలాండ్ ఓపెనింగ్ జోడీ ఈ టోర్నీలో సూపర్ హిట్‌గా నిలిచింది. వారి ఓపెనర్లు సగటున 84 పరుగులు జోడిస్తూ అగ్రస్థానంలో ఉన్నారు. చివరికి మన తర్వాతి ప్రత్యర్థి జింబాబ్వే ఓపెనర్లు కూడా సగటున 53.33 పరుగులు సాధించి భారత్‌కు హెచ్చరికలు పంపిస్తున్నారు. ఇషాన్ కిషన్ ఒక్క మ్యాచ్‌లో కూడా శుభారంభం ఇవ్వలేకపోగా, అభిషేక్ శర్మ ఫామ్ లేమితో కొట్టుమిట్టాడుతున్నాడు. బంతిని బాదడమే లక్ష్యంగా క్రీజులోకి వస్తున్న ఈ ఇద్దరు, కనీసం పవర్ ప్లే కూడా పూర్తి చేయకుండానే పెవిలియన్ చేరుతున్నారు.
Opening partnership Average in 2026 T20WC
84.00 – NZ
57.75 – SCO
54.25 – AUS
53.33 – ZIM
45.66 – ITA
38.75 – CAN
37.20 – SA
36.25 – USA
33.25 – AFG
32.25 – NAM
30.25 – NEP
30.25 – PAK
27.50 – WI
24.00 – SL
22.00 – NED
16.40 – ENG
15.50 – UAE
14.33 – IRE
10.00 – Oman
6.80 -…— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) February 23, 2026
ఈ నేపథ్యంలో టీమిండియా ఓపెనింగ్ జోడీని మార్చాల్సిన సమయం ఆసన్నమైందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫామ్ లేని అభిషేక్ శర్మను పక్కన పెట్టి, సంజూ శామ్సన్‌ను ఓపెనర్‌గా పంపాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. జట్టు అసిస్టెంట్ కోచ్ కూడా రాబోయే మ్యాచ్‌లకు ముందు సంజూ పేరును పరిశీలిస్తామని హింట్ ఇచ్చారు. మరి జింబాబ్వే, వెస్టిండీస్ వంటి కీలక మ్యాచ్‌లలోనైనా ఓపెనర్లు కళ్ళు తెరుస్తారా? లేక పాత పద్ధతిలోనే చేతులెత్తేస్తారా? అనేది తేలాల్సి ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..