
India vs New Zealand, 4th T20I: విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న ఈ టీ20 సిరీస్‌లో భారత్‌కు 216 పరుగుల విజయ లక్ష్యాన్ని న్యూజిలాండ్ నిర్దేశించింది.
న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగులు చేసింది. టిమ్ సీఫెర్ట్ 62 పరుగులు చేయగా, ఓపెనర్ డెవాన్ కాన్వే 44 పరుగులు చేశాడు. ఇద్దరూ 100 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని పంచుకున్నారు.
భారత్ తరపున అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, జస్‌ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీశారు.
భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్) , హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్.
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), జాక్ ఫౌల్క్స్, జాకబ్ డఫీ, ఇష్ సోధి, మాట్ హెన్రీ.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..