
Virat Kohli: క్రికెట్ ప్రపంచాన్ని తన బ్యాటింగ్‌తో దశాబ్దానికి పైగా శాసించిన రారాజు, పరుగుల యంత్రం, ఆధునిక క్రికెట్ దేవుడు.. ఇలా విరాట్ కోహ్లీకి ఉన్న బిరుదులు ఎన్నో. సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ స్థాయిలో అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న ఈ ఢిల్లీ డైనమైట్, తన కెరీర్‌లో సాధించని రికార్డులు లేవు, అందుకోని శిఖరాలు లేవు. అయితే, ఎన్నో ఘనతలు సాధించిన అతని కిరీటంలో ఒకే ఒక్క వెలితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా తన తొలి ఐపీఎల్ టైటిల్‌ను తాజాగా గెలుచుకుంది. దీంతో మరో టైటిల్ కింగ్ కోహ్లీ ఖాతాలో వచ్చి చేరింది. గత 17 ఏళ్లుగా ఈ ట్రోఫీ కోసం ఎదురుచూసిన కోహ్లీ.. ఎట్టకేలకు 18వ సీజన్‌లో ఈ కలను సాధించుకున్నాడు. అయితే, కోహ్లీ ఎప్పటికీ అందుకోలేని ట్రోఫీ ఒకటి ఉంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకే ఆడుతున్నాడు. 2013లో ఆ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి ఎన్నో సీజన్ల పాటు జట్టును ముందుండి నడిపించాడు. ఈ ప్రయాణంలో ఎన్నో చిరస్మరణీయ విజయాలున్నాయి, వ్యక్తిగతంగా అద్భుతమైన రికార్డులున్నాయి.
ఏ ట్రోఫీ అందుకోలేదంటే..
విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ట్రోఫీని గెలవలేదు. భారత జట్టు 2సార్లు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుని, 2సార్లు ఓటమిని ఎదుర్కొవాల్సి వచ్చింది. అదే సమయంలో కోహ్లీ టీ20 తర్వాత, టెస్ట్ క్రికెట్ నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇకపై విరాట్ టీ20, టెస్టులు ఆడలేదు. అంటే, డబ్ల్యూటీసీ ఆడడన్నమాట.
విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 50 ఓవర్ల ప్రపంచ కప్‌ను 2011 సంవత్సరంలో గెలుచుకున్నాడు. విజేత జట్టులో సభ్యుడిగా కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత 2013, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలు గెలిచిన కోహ్లీ.. 2024లో టీ20 ప్రపంచ కప్‌ను గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ట్రోఫీ లేకుండా కెరీర్ ముగించాడన్నమాట.
ఆ ఒక్క ట్రోఫీ లేకపోయినా, విరాట్ కోహ్లీ సాధించిన ఘనతలు అసమాన్యమైనవి. అతని పేరు మీద ఉన్న రికార్డులే అతని గొప్పతనానికి నిదర్శనం.
పరుగుల యంత్రం:
కెప్టెన్‌గా విజయాలు:
ప్రపంచ విజేతగా: కెప్టెన్‌గా ఐసీసీ సీనియర్ ట్రోఫీ గెలవకపోయినా, ఒక ఆటగాడిగా రెండు మేజర్ ఐసీసీ టోర్నమెంట్లు గెలిచిన భారత జట్టులో కోహ్లీ సభ్యుడు.
అవార్డులు, పురస్కారాలు:
ఒక ఆటగాడి గొప్పతనాన్ని కేవలం గెలిచిన ట్రోఫీల సంఖ్యతో కొలవలేం. విరాట్ కోహ్లీ క్రికెట్‌కు అందించిన సేవ, మైదానంలో అతను చూపించిన ఆవేశం, కోట్లాది మంది యువతకు అతను అందించిన స్ఫూర్తి అసమానమైనవి. డబ్ల్యూటీసీ ట్రోఫీ అనే వెలితి ఉన్నప్పటికీ, ఆధునిక క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ అధ్యాయం ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది. అతను ఎప్పటికీ “కింగ్ కోహ్లీ”నే!
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..