IND vs WI: నెట్టింట వైరల్‌ అవుతోన్న సూర్య కుమార్‌ ‘నమస్తే’ సెలబ్రేషన్స్‌.. మీరూ ఓ లుక్కేయండి..

|

Feb 21, 2022 | 11:21 AM

IND vs WI: వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన చివరి టీ20లో భారత్‌ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకుంది. సిరీస్‌ను వైట్‌ వాష్‌ చేసింది టీమిండియాం. ఇలా వరుసగా మూడో సిరీస్‌ను వైట్‌ వాష్‌ చేసిన కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ అరుదైన...

IND vs WI: నెట్టింట వైరల్‌ అవుతోన్న సూర్య కుమార్‌ నమస్తే సెలబ్రేషన్స్‌.. మీరూ ఓ లుక్కేయండి..
Surya Kumar Yadav
Follow us on

IND vs WI: వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన చివరి టీ20లో భారత్‌ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకుంది. సిరీస్‌ను వైట్‌ వాష్‌ చేసింది టీమిండియాం. ఇలా వరుసగా మూడో సిరీస్‌ను వైట్‌ వాష్‌ చేసిన కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ అరుదైన గుర్తుంపును సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా స్కోర్‌ భారీగా పెరగడంలో సూర్య కుమార్‌ యాదవ్‌ కీలక పాత్ర పోషించాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం 31 బంతుల్లో 65 పరుగులు సాధించి మంచి ఇన్నింగ్స్‌ అందించాడు. వీటిలో ఏకంగా 7 సిక్సర్లు, ఒకే ఫోర్‌ ఉండడం విశేషం.

ఈ క్రమంలోనే సూర్యకుమార్‌ టీ20ల్లో తన నాలుగో హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సిక్సర్‌తో హాఫ్‌ సెంచరీని పూర్తి చేయడం విశేషం. ఇక హాఫ్‌ సెంచరీ పూర్తికాగానే సూర్యకుమార్‌ చేసిన సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. అర్థ శతకం పూర్తికాగానే సూర్యకుమార్ బ్యాట్ పైకెత్తి సహచరులకు అభివాదం చేశాడు. అనంతరం రెండు చేతులు జోడించి ‘నమస్కారం’ తెలిపాడు. దీంతో దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ‘నమస్తే సెలబ్రేషన్స్‌’ పేరుతో నెట్టింట వైరల్‌ అవుతోంది. సూర్యకుమార్‌ హుందాతనానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఇదిలా ఉంటే తన అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియాకు విజయాన్ని అందించిన సూర్యకుమార్‌ యాదవ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. మ్యాచ్‌ ముగిసన తర్వాత సూర్యకుమార్‌ మాట్లాడుతూ.. ‘రోహిత్ శర్మ అవుటైన తర్వాత క్రీజులో కుదురుకుని మంచి స్కోరు సాధించాల్సిన అవసరం ఉందని భావించాను. తీవ్రమైన ఒత్తిడిలోనూ ఎలా రాణించాలన్న దానిపై జట్టు సమావేశాల్లో చర్చించుకున్నాము. ఇప్పుడది బాగా పనికొచ్చింది’ అని చెప్పుకొచ్చాడు.

Also Read: Balakrishna memes: మీమ్స్‌పై బాలయ్య రియాక్షన్‌.. మాములుగా లేదు..! తన స్టయిలే వేరు అంటూ… నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో..

AP News: తినే వస్తువు అనుకొని.. జండూబామ్ డబ్బా మింగిన శిశువు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

Minister Goutham Reddy: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో కన్నుమూత