IND VS SA: వరుసగా 5 మ్యాచ్‌ల్లో ఫ్లాప్.. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు ఎంపిక కష్టమే.. ప్రమాదంలో ఆ సీనియర్ ప్లేయర్ కెరీర్‌..!

|

Dec 15, 2021 | 7:14 AM

Vijay Hazare Trophy 2021: విజయ్ హజారే ట్రోఫీలో శిఖర్ ధావన్ పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లడం కష్టంగా మారింది.

IND VS SA: వరుసగా 5 మ్యాచ్‌ల్లో ఫ్లాప్.. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు ఎంపిక కష్టమే.. ప్రమాదంలో ఆ సీనియర్ ప్లేయర్ కెరీర్‌..!
4. శిఖర్ ధావన్: గత సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోలేదు. దీంతో ధావన్ వేలంలో అందుబాటులో ఉంటాడు. గతేడాది ధావన్‌కు ఢిల్లీ రూ. 5.2 కోట్లు చెల్లించింది. 2014లో జరిగిన IPL వేలంలో ధావన్ అత్యధిక వేతనాన్ని రూ. 12.5 కోట్లకు SRH కొనుగోలు చేసింది.
Follow us on

Shikhar Dhawan: క్రికెట్‌లో టైమింగ్ చాలా ముఖ్యం. బ్యాట్స్‌మెన్‌గా టైమింగ్ లేకపోతే పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడలేం. శిఖర్ ధావన్ ఈ టైమింగ్‌తో తెగ ఇబ్బంది పడుతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్న శిఖర్ ధావన్ వరుసగా ఐదు మ్యాచ్‌లలో విఫలమయ్యాడు. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు ధావన్ ఎంపిక చాలా కష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీ తరఫున ఆడుతున్న శిఖర్ ధావన్ కూడా మంగళవారం సౌరాష్ట్రపై ఫ్లాప్ అయ్యాడు. 27 బంతుల్లో ధావన్‌ బ్యాట్‌ నుంచి 12 పరుగులు మాత్రమే వచ్చాయి. ధావన్‌ను జయదేవ్ ఉనద్కత్ ఔట్ చేశాడు. ధావన్ వైఫల్యం ఢిల్లీని మరింత దెబ్బతీసింది. జట్టు కూడా 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ధావన్ పేలవ ప్రదర్శన చేశాడు. అతని బ్యాటింగ్‌లో 11.20 సగటుతో 56 పరుగులు మాత్రమే వచ్చాయి. అతని స్ట్రైక్ రేట్ కూడా 53గానే ఉంది. అదేవిధంగా దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు ధావన్ ఎంపికపై కత్తి వేలాడుతుండగా, పేలవ ప్రదర్శన అగ్నికి ఆజ్యం పోసినట్లైంది.

టెస్టు జట్టుతో పాటు టీ20 జట్టుకు కూడా శిఖర్ ధావన్ దూరమయ్యాడు. టీ20 ప్రపంచకప్‌లో ధావన్‌కు చోటు దక్కకపోవడంతో ప్రస్తుతం వన్డే జట్టులోకి రావడం కూడా కష్టతరంగా మారింది. అతని స్థానంలో రితురాజ్ గైక్వాడ్‌ను వన్డే జట్టులోకి తీసుకోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

విజయ్ హజారే ట్రోఫీ ప్రస్తుత సీజన్‌లో రితురాజ్ గైక్వాడ్ 4 సెంచరీలు బాదేశాడు. గైక్వాడ్ కేవలం 5 మ్యాచ్‌ల్లోనే 600 పరుగులు పూర్తి చేశాడు. గైక్వాడ్‌ ప్రస్తుతం అద్భుత ఫాంలో ఉన్నాడు. టీమ్ ఇండియాలో అవకాశం పొందవచ్చని తెలుస్తోంది.

Also Read: 3 ఫార్మాట్‌లు, 3 ప్లేయర్‌లు.. క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగుల జాబితాలో వీరే టాప్..!

Viral Video: సిక్స్ కొట్టిన బంతిని అందుకునేందుకు అభిమాని ప్రయత్నం.. తల పగిలి రక్తం..