IND vs NZ: పుణె టెస్ట్‌కు ముందే సర్ఫరాజ్‌కు గుడ్‌న్యూస్.. తండ్రిగా ప్రమోషన్..

|

Oct 22, 2024 | 10:08 AM

Sarfaraz Khan Becomes Father of Baby Boy: భారత జట్టు బెంగళూరు నుంచి పుణె చేరుకుంది. రెండో టెస్ట్ కోసం సన్నాహాలు ఇప్పటికే ప్రారంభించింది. అయితే, పుణె చేరుకున్న టీమిండియా సెంచరీ ప్లేయర్‌కు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. దీంతో పుణె నుంచి ముంబై చేరుకున్నాడు.

IND vs NZ: పుణె టెస్ట్‌కు ముందే సర్ఫరాజ్‌కు గుడ్‌న్యూస్.. తండ్రిగా ప్రమోషన్..
Sarfaraz Khan Becomes Fathe
Follow us on

Sarfaraz Khan Becomes Father of Baby Boy: భారత క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రి అయ్యాడు. అతని భార్య ఒక కొడుకుకు జన్మనిచ్చింది. సర్ఫరాజ్ ఖాన్ ప్రస్తుతం న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ కోసం భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. బెంగళూరులో తొలి టెస్టు అనంతరం రెండో టెస్టు కోసం టీమిండియాతో కలిసి పుణె చేరుకున్నాడు. ఇక్కడి నుంచి ముంబై వెళ్లిపోయాడు. సర్ఫరాజ్ తండ్రి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారితో ఉన్న ఫొటోను పోస్ట్ చేసి, ‘బేబీ బాయ్’ అంటూ రాసుకొచ్చాడు. ఒక ఫొటోలో బిడ్డతో కలిసి ఉన్న సర్ఫరాజ్.. మరో ఫొటోలో ఆయన తండ్రితోపాటు ఉన్నాడు. 2023 ఆగస్టులో వివాహం సర్ఫరాజ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కాశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో సర్ఫరాజ్ వివాహం జరిగింది.

సర్ఫరాజ్ 2024లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో నిరంతరం అద్భుతాలు చేసిన సర్ఫరాజ్.. ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌కు టీమ్ ఇండియాకు ఎంపికయ్యాడు. అరంగేట్రం టెస్టులోనే అర్ధ సెంచరీలు సాధించాడు. ఇటీవల, బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో అతను సెంచరీ సాధించాడు. ఇది అతని టెస్ట్ కెరీర్‌లో మొదటి సెంచరీగా నిలిచింది. ఇందులో 150 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ, భారత జట్టుకు సుదీర్ఘంగా తానే రేసు గుర్రం అని నిరూపించుకోగలనని సర్ఫరాజ్ నిరూపించాడు.

సర్ఫరాజ్ ఫస్ట్ క్లాస్ కెరీర్..

సర్ఫరాజ్ ఇప్పటివరకు నాలుగు టెస్టులు ఆడాడు. 58.33 సగటుతో 350 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు అతని పేరు మీద ఉన్నాయి. అంతకుముందు దేశవాళీ క్రికెట్‌లో ఈ యువ బ్యాట్స్‌మెన్ అద్భుత ప్రదర్శన చేశాడు. అతను 52 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 69.27 సగటుతో 4572 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతను 16 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇప్పుడు మరోసారి ఐపీఎల్‌లో ఆడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ టోర్నీలో ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మూడు జట్లకు 50 మ్యాచ్‌లు ఆడగా 585 పరుగులు మాత్రమే చేయగలిగాడే. గత ఐపీఎల్‌లో కూడా అతనికి ఆడే అవకాశం రాలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..