IND vs SA 2nd T20I: రెండో మ్యాచ్‌ నుంచి ఫ్లాప్ స్టార్ ఔట్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన బ్యాడ్‌లక్ ప్లేయర్..?

Sanju Samson: వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టోర్నమెంట్‌లను దృష్టిలో ఉంచుకుని, సెలెక్టర్లు టాప్ ఆర్డర్‌లో స్థిరత్వాన్ని కోరుకుంటున్నారు. గిల్ ఆటతీరులో నిలకడ లోపించడం మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు, సంజు శాంసన్ దేశవాళీ క్రికెట్‌లోనూ, ఐపీఎల్‌లోనూ నిలకడగా రాణిస్తుండటం, క్లిష్ట పరిస్థితుల్లోనూ సంయమనంతో ఆడగలగడం అతనికి ప్లస్ పాయింట్‌గా మారింది.

IND vs SA 2nd T20I: రెండో మ్యాచ్‌ నుంచి ఫ్లాప్ స్టార్ ఔట్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన బ్యాడ్‌లక్ ప్లేయర్..?
Ind Vs Sa

Updated on: Dec 10, 2025 | 8:43 PM

India vs South Africa 2nd T20I: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో నిరాశపరిచిన నేపథ్యంలో, డిసెంబర్ 11న చండీగఢ్‌లో జరగనున్న రెండో టీ20 మ్యాచ్ కోసం జట్టు మేనేజ్‌మెంట్ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ మార్పుతో వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌కు మరోసారి అదృష్టం వరించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సంజు శాంసన్ వికెట్ కీపర్ జితేష్ శర్మ స్థానంలో కాకుండా, ఒక స్టార్ ఓపెనర్ స్థానంలో జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది.

శుభ్‌మన్ గిల్ స్థానంలో సంజు శాంసన్?

సమాచారం ప్రకారం, ఫామ్ లేమితో సతమతమవుతున్న స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను పక్కన పెట్టి, ఆయన స్థానంలో సంజు శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Tilak Varma: కటక్ టీ20లో తెలుగబ్బాయ్ చారిత్రాత్మక రికార్డ్.. ఆ లిస్ట్‌లో తొలి భారతీయుడిగా..

గిల్ వైఫల్యం: గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్, తొలి టీ20లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. క్రీజులో అతను ఇబ్బంది పడుతూ కనిపించాడు. అతని షాట్లలో తొందరపాటు, ఫిట్‌నెస్ లేమి స్పష్టంగా కనిపించడంతో మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.

సంజుకు ఓపెనింగ్ బాధ్యతలు: గిల్ స్థానంలో సంజు శాంసన్‌ను ఓపెనర్‌గా బరిలోకి దింపే యోచనలో టీమిండియా ఉంది. సంజుకు ఇన్నింగ్స్ ప్రారంభించే సామర్థ్యం, పవర్ ప్లేలో వేగంగా ఆడగలిగే సత్తా ఉండటం జట్టుకు కలిసిరానుంది.

ఇది కూడా చదవండి: ఎవర్రా సామీ నువ్వు.. 23 ఫోర్లు, 18 సిక్సర్లు.. 56 బంతుల్లో 219 పరుగులు.. టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ

టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచన ఇదే..

వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టోర్నమెంట్‌లను దృష్టిలో ఉంచుకుని, సెలెక్టర్లు టాప్ ఆర్డర్‌లో స్థిరత్వాన్ని కోరుకుంటున్నారు. గిల్ ఆటతీరులో నిలకడ లోపించడం మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు, సంజు శాంసన్ దేశవాళీ క్రికెట్‌లోనూ, ఐపీఎల్‌లోనూ నిలకడగా రాణిస్తుండటం, క్లిష్ట పరిస్థితుల్లోనూ సంయమనంతో ఆడగలగడం అతనికి ప్లస్ పాయింట్‌గా మారింది.

దీంతో రెండో టీ20లో సంజు శాంసన్ బ్యాట్ ఝుళిపించి, జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకుంటాడో లేదో చూడాలి.