Hardik Pandya: ‘నీపని అయిపోందన్నారు.. కానీ, చరిత్ర సృష్టించి, తగిన సమాధానం చెప్పావ్’

|

Jun 02, 2022 | 6:10 AM

Krunal Pandya: ఐపీఎల్ 2022 గెలిచినందుకుగాను హార్దిక్ పాండ్యాకు కృనాల్ పాండ్యా ఓ భావోద్వేగ సందేశాన్ని పంపించాడు.

Hardik Pandya: నీపని అయిపోందన్నారు.. కానీ, చరిత్ర సృష్టించి, తగిన సమాధానం చెప్పావ్
Hardik Pandya
Follow us on

గుజరాత్ టైటాన్స్ IPL 2022 టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా Instagramలో భావోద్వేగ సందేశాన్ని పంపించాడు. ‘నువ్వు సాధించావ్, చరిత్ర సృష్టించావు’ అంటూ రాసుకొచ్చాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన టైటిల్ మ్యాచ్‌లో 34 పరుగులు చేయడంతో పాటు, హార్దిక్ పాండ్యా 3 కీలక వికెట్లు కూడా పడగొట్టాడు. దీని కారణంగా ఆఖరి మ్యాచ్‌లో జట్టు ఏకపక్షంగా విజయం సాధించింది. ‘నా సోదరా, మీ విజయం వెనుక ఎంత కృషి ఉందో మీకు మాత్రమే తెలుసు. ఎన్ని రోజులు, లెక్కలేనన్ని గంటల శిక్షణ, క్రమశిక్షణ, మానసిక బలంతో ముందుకు సాగావు. నువ్వు ట్రోఫీని ఎత్తడం చూస్తుంటే… నీ కష్టానికి ఫలితం దక్కింది. నువ్వు విలువైనవాడివి’ అంటూ కృనాల్ పాండ్యా శుభాకాంక్షలు తెలిపాడు.

అలాగే ‘నీ పని అయిపోయిందని భావించిన వారికి, తగిన విధంగా బవాబు ఇచ్చావ్, చరిత్ర సృష్టించావు. లక్ష మందికి పైగా నీ నామస్మరణ చేస్తున్నప్పుడు నేను అక్కడ ఉన్నాననుకుంటా’ అంటూ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో పేలవమైన ప్రదర్శన చేసినందుకు హార్దిక్ పాండ్యాపై చాలా విమర్శలు వచ్చాయి. దీంతో అతడు టీమ్ ఇండియాకు కూడా దూరమవ్వాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

హార్దిక్ పాండ్యా కష్ట సమయాల్లో పట్టు వదలకుండా కష్టపడి పని చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు అతనిని విమర్శించే వారు ఎంఎస్ ధోని కెప్టెన్సీతో పోలుస్తున్నారు. హార్దిక్ కూడా ప్రస్తుతం టీమిండియాకు తిరిగి వచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..