Hardik Pandya: 10, 20 కాదు.. ఏకంగా 100 కంటే ఎక్కువ BMW కార్లు కొనొచ్చు.. హార్దిక్ వాచ్ ధర తెలిస్తే మైండ్ బ్లాంకే..

Hardik Pandya Watch Price: హార్దిక్ పాండ్యా ఆసియా కప్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. టీమిండియాను ఫైనల్స్‌కు కూడా నడిపించాడు. అయితే, ఈ వార్త అతని ఆట గురించి కాదండోయ్.. అతని స్పెషల్ వాచ్ గురించి. దీని ధరతో 100 కంటే ఎక్కువ BMW కార్లను కొనుగోలు చేయవచ్చు.

Hardik Pandya: 10, 20 కాదు.. ఏకంగా 100 కంటే ఎక్కువ BMW కార్లు కొనొచ్చు.. హార్దిక్ వాచ్ ధర తెలిస్తే మైండ్ బ్లాంకే..
Hardik Pandya Watch Price

Updated on: Sep 26, 2025 | 5:22 PM

Hardik Pandya Watch Price: హార్దిక్ పాండ్యా తన భారీ సిక్సర్లు, అలాగే అద్భుతమైన బౌలింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. కానీ అతన్ని తరచుగా వార్తల్లో ఉంచే మరో విషయం కూడా ఉందండోయ్. అది హార్దిక్ పాండ్యా వాచ్‌లు. హార్దిక్ పాండ్యా గడియారాల సేకరణ తరచుగా వార్తల్లో ఉంచుతుంది. మరోసారి, ఈ టీం ఇండియా ఆల్ రౌండర్ ఒక వాచ్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. హార్దిక్ పాండ్యా ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో అతను 100 కంటే ఎక్కువ BMW కార్ల ఖరీదు చేసే వాచ్‌ను ధరించాడు. అసలు హార్దిక్ పాండ్యా ఎలాంటి వాచ్ ధరించాడు, దాని ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..

హార్దిక్ పాండ్యా వాచ్ విలువ రూ. 53 కోట్లు..

హార్దిక్ పాండ్యా ధరించిన వాచ్ RM 56-03. రిచర్డ్ మిల్లె RM 56-03 అనేది లగ్జరీ టూర్‌బిల్లాన్ వాచ్. ఇది బ్రాండ్ సఫైర్ సిరీస్‌లో భాగంగా పరిగణిస్తుంటారు. ఈ గడియారం దాని పారదర్శక డిజైన్‌కు ప్రసిద్ధి చెందింది. ఈ గడియారం పూర్తిగా స్క్రాచ్-ప్రూఫ్, దీని తయారీకి 40 రోజులకు‌పైగా పడుతుంది. ఈ గడియారం 50 మీటర్ల వరకు నీటి నిరోధకతను కలిగి ఉంటుంది. మార్కెట్లో దీని ధర రూ. 53 కోట్ల వరకు ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఆసియా కప్ ట్రోఫీ గెలుపు దిశగా..

హార్దిక్ పాండ్యా దగ్గర ఈ ఖరీదైన గడియారం మాత్రమే కాదండోయ్. అతని దగ్గర కోటి రూపాయలకుపైగా విలువైన అనేక గడియారాలు ఉన్నాయి. హార్దిక్ పాండ్యా గడియారాల సేకరణ నిజంగా అద్భుతమైనది. యుఎఇలో జరుగుతున్న ఆసియా కప్‌లో అతను బ్యాట్, బాల్ రెండింటిలోనూ బాగా రాణిస్తున్నాడు. ఇప్పుడు టీం ఇండియా ఫైనల్‌కు చేరుకుంది. సెప్టెంబర్ 28న జరిగే ఫైనల్‌లో ఎలాంటి ప్లేయింగ్ 11తో బరిలోకి దిగనుందో ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..